దేశంలో అన్ని రంగాల్లోనూ ముందున్న తెలంగాణ
సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తున్నసీఎం కెసిఆర్ 68 లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్లకు పెంచిన పంటల ఉత్పత్తి రైతుల వద్దే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పరిశ్రమకు సూచన మనోహరాబాద్‌లో ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ విధాత, మెదక్ బ్యూరో: సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రూ.800 కోట్ల పెట్టుబడులతో ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమను రాష్ట్ర ఐటీ, […]

- సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తున్నసీఎం కెసిఆర్
- 68 లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్లకు పెంచిన పంటల ఉత్పత్తి
- రైతుల వద్దే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పరిశ్రమకు సూచన
- మనోహరాబాద్‌లో ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
విధాత, మెదక్ బ్యూరో: సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రూ.800 కోట్ల పెట్టుబడులతో ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు.
స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించేలా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారిని ఆదుకునే బాధ్యత మనపై ఉందని, కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కెట్స్ కోసం ఆలుగడ్డలు, గోధుమలు ఇక్కడే కొనాలని ఐటీసీ చైర్మన్‌ని కోరారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందన్నారు. 68 లక్షల టన్నుల పంటల ఉత్పత్తిని మూడున్నర కోట్లకు తెలంగాణ ప్రభుత్వం పెంచిందని తెలిపారు. రైతుల వద్ద నుండే పంట ఉత్పత్తులను పరిశ్రమ కొనుగోలు చేయాలని సూచించారు.
నీటి వనరుల్లో విప్లవం సాధించాం
నీటి వనరుల్లో విప్లవాన్ని సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 10 టీఎంసీ ల నీరు పరిశ్రమలకు కాళేశ్వరం ద్వారా అందిస్తున్నామని, ఇంటింటికి మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని పేర్కొన్నారు. 46 వేల చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసామని, ఫుడ్ ప్రాసెస్సింగ్ హబ్ కోసం స్పెషల్ సెజ్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కోళ్ల పరిశ్రమకి , దాణాకి తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాలని అందుకే వాటిపై దృష్టి పెట్టామన్నారు. వంట నూనెలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణలో వంట నూనెల పంటలను ప్రోత్సహిస్తామని, కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు మనం సహకారం అందించాలని కోరారు.
మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరంతా అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం మెదక్ జిల్లా మనోహోరాబాద్ లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, హేమలత శేఖర్ గౌడ్ లతో కలిసి ఐటీసీ ఫుడ్ ఫుడ్ తయారీ పరిశ్రమను ప్రారంభించారు.