TDP: 12న కరీంనగర్‌లో తెలుగుదేశం శంఖారావం
ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు బస్సు యాత్రకు సన్నాహాలు శంఖారావసభలో TDPలో చేరుతున్న ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు గంగాధర కనకయ్య విధాత బ్యూరో, కరీంనగర్: పోయిన చోటనే వెతుక్కోవాలన్నది ఓ సామెత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం క్రమేపీ ప్రభావం కోల్పోతూవస్తున్న తెలుగుదేశం పార్టీ గత వైభవం కోసం తిరిగి ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగా తొలుత 7 నియోజకవర్గాల్లో ప్రారంభించిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని 100 నియోజకవర్గాలకు […]

- ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాలు
- కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు బస్సు యాత్రకు సన్నాహాలు
- శంఖారావసభలో TDPలో చేరుతున్న ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు గంగాధర కనకయ్య
విధాత బ్యూరో, కరీంనగర్: పోయిన చోటనే వెతుక్కోవాలన్నది ఓ సామెత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం క్రమేపీ ప్రభావం కోల్పోతూవస్తున్న తెలుగుదేశం పార్టీ గత వైభవం కోసం తిరిగి ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగా తొలుత 7 నియోజకవర్గాల్లో ప్రారంభించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని 100 నియోజకవర్గాలకు విస్తరించింది. మరోవైపు బస్సు యాత్రలకు సన్నాహాలు చేస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకనాడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఉద్యమాలకు పురిటి గడ్డలాంటి
ఈ జిల్లాపై తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం దృష్టి సారించింది. చాప కింద నీరులా సభ్యత్వ నమోదు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇక్కడి నుండి ఆదిలాబాద్ వరకు సింగరేణి ప్రాంతాన్ని కలుపుతూ బస్సు యాత్ర నిర్వహించాలని ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈ నెల 12న కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో
తెలుగుదేశం శంఖారావ సభ నిర్వహిస్తోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు కంభంపాటి రామ్మోహన్, బక్కని నరసింహులు, పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నన్నూరి నరసింహారెడ్డి తదితరులు శంఖారావ సభకు హాజరుకానున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మచ్చ పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు గంగాధర కనకయ్య సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో శంఖారావసభలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. జిల్లాలో బీసీ వర్గాలను తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరువచేసేలా నేతలు పావులు కదుపుతున్నారు