విధాత: జనసేనాని పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు పొద్దున్న ఏపీ ఇన్ ఛార్జ్ మురళీ దేవధర్ (MURALI DEODHAR)తో సమావేశమయ్యారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ఇంకా వీలును బట్టి హోమ్ మంత్రి అమిత్ షాను కలుస్తారని అంటున్నారు. వాస్తవానికి పవన్ ఢిల్లీ టూర్ మీద టీడీపీలో టెన్షన్ నెలకొంది. అసలు పవన్ ఎవర్ని కలుస్తున్నారు… ఏమేం మాట్లాడుతున్నారు.. ఆయన మనసులో ఏముంది. ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి టీడీపీ నాయకుల్లో ఉంది.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ (TDP) అధికారంలోకి రావడానికి జనసేనలో ఉన్న పొత్తే కారణం అన్నది అందరికి తెలిసిందే. అదే టీడీపీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి ఘోరంగా దెబ్బతినడంతో పొత్తులు లేకుండా ఒంటరి ప్రయాణ చంద్రబాబుకు అచ్చిరాదన్నది మరోమారు స్పష్టమైంది. ఈ తరుణంలో పవన్ ఢిల్లీలో బీజేపీ వాళ్లతో ఏం మాట్లాడతారు .. రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్తారా.? లేదా టీడీపీతో వెళ్తారా. అసలు ఆయన డిమాండ్స్ ఏమిటన్నది టీడీపీ ఆరాతీస్తోంది.
గతంలో పవన్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ తన వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చినదని అన్నారు. అదే సమయంలో తానె గెలవలేని పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఎలా గెలిపిస్తారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెక్కిరించినా విషయమూ ప్రస్తావనకు వస్తోంది. సరే గతం గతః.. కానీ రానున్న ఎన్నికల్లో ఎలా.? ఒంటరిగా పోవడమా ..? పవన్ను కలుపుకుని వెళ్లడమా అన్నది టీడీపీలో చర్చ నడుస్తోంది.
ఒకవేళ పవన్ను కలుపుకుంటే ఆయన ఎన్ని సీట్లు అడుగుతాడో తెలీదు. అన్ని సీట్లు జనసేనకు ఇచ్చేస్తే ఇక్కడున్నవాళ్లను ఎలా సర్దుబాటు చేస్తాం… పోనీ పవన్ను(Pawan Kalyan) కాదనుకుని ఒంటరిగా వెళితే జగన్ను ఎదుర్కోవడం సాధ్యమేనా.? అలా ప్రయోగం చేసి తేడా కొడితే మొత్తం పార్టీ ఉనికికే ప్రమాదం కదా. అని టిడిపి(TDP) పెద్దల్లో ఓ అభిప్రాయం ఉంది. అందుకే అసలు పవన్ మనసులో ఏముంది.. ఢిల్లీలో బీజేపీతో(BJP) ఏం మాట్లాడి ఉంటారు.. మనతో కలిసి వస్తాడా ..? రాడా..? ఇవన్నీ ప్రస్తుతం టిడిపి వర్గాలను కలవరపరుస్తున్నాయి.