ట్విట్టర్లో కోతలు మొదలెట్టిన మస్క్.. వేలల్లో స్టాఫ్ ఫసక్‌

విధాత: కార్ల వ్యాపారం నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోకి దూసుకొచ్చిన ఎలాన్ మస్క్ వస్తూనే కత్తి ఝుళిపిస్తున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఈ కుబేరుడు మొన్నటికి మొన్న బ్లూ టిక్కులు రావాలంటే ట్విట్టర్ యూజర్లు ఇరవై డాలర్ల వరకూ ఫీజు కట్టేలా చూడాలని స్టాఫ్‌ను పురమాయించారు. అయితే ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి వేలాది మంది స్టాఫ్‌ను తొలగించి ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నారు.. ఇప్పటికే సీఈవో సీఈవో సహా చాలా మంది ఉన్నతాధికారులను తొలగించిన ఎలన్ […]

  • By: krs    latest    Nov 04, 2022 2:27 PM IST
ట్విట్టర్లో కోతలు మొదలెట్టిన మస్క్.. వేలల్లో స్టాఫ్ ఫసక్‌

విధాత: కార్ల వ్యాపారం నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోకి దూసుకొచ్చిన ఎలాన్ మస్క్ వస్తూనే కత్తి ఝుళిపిస్తున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఈ కుబేరుడు మొన్నటికి మొన్న బ్లూ టిక్కులు రావాలంటే ట్విట్టర్ యూజర్లు ఇరవై డాలర్ల వరకూ ఫీజు కట్టేలా చూడాలని స్టాఫ్‌ను పురమాయించారు. అయితే ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి వేలాది మంది స్టాఫ్‌ను తొలగించి ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నారు..

ఇప్పటికే సీఈవో సీఈవో సహా చాలా మంది ఉన్నతాధికారులను తొలగించిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఉద్యోగులపై పడ్డారు. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నారని.. అందుకోసం జాబితా సిద్ధం చేశారని అంటున్నారు.

ఈ మేరకు ట్విట్టర్ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు సమాచారం. ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఈ మెయిల్స్ లో అప్రమత్తం చేసిందని.. ఉద్యోగులు కోతలు మొదలవుతున్న దృష్ట్యా సిబ్బంది.. శుక్రవారం ఆఫీసుకు రావద్దని మెయిల్‌లో సూచించారు.

ట్విట్టర్‌ను సరైన మార్గంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిలబెట్టేందుకు ఉద్యోగుల తగ్గింపు ప్రక్రియను మొదలుపెట్టాల్సి వచ్చిందని.. ఇప్పటివరకూ అందించిన మీ విలువైన సహకారాన్ని అందించారని.. ఈ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందని తెలిసినా కంపెనీని విజయవంతంగా నడిపేందుకు ఈ చర్య తప్పదంటూ ఉద్యోగులకు కంపెనీ ఈ మెయిల్ చేసింది.

ఇక విధుల నుంచి తీసేసిన ఉద్యోగులకు రెండు నెలల జీతంతో పాటు వారి ఈక్విటీలకు సమానమైన నగదును మూడు నెలల్లోగా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3700 మందిని విధుల నుంచి తొలగిస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ట్విట్టర్ సరిగా పని చేయలేదు. సర్వర్ డౌన్ అవడంతో పోష్టులు పెట్టడం కుదరలేదని అంటున్నారు.