ఒక్కో ఫ్యామిలీలో డజనకు పైగా హీరోలు ఉన్నారు! అందుకే.. అవకాశాలు రావడం లేదు

టాలీవుడ్‌లో బంధుప్రీతి..  ఇక్కడ.. సైడ్ ఆర్టిస్ట్‌ల‌ కోసం మాత్రమే అడిషన్స్ వివాదాస్ప‌దం అవుతున్న శేష్‌ కామెంట్స్‌ విధాత: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం అడవి శేషు అనే చెప్పాలి. ఈయ‌న బ‌హుముఖ ప్రజ్ఞాశాలి. తానే స్క్రిప్టు రాసుకుంటాడు. అవసరమైతే తానే సొంతంగా నిర్మించుకుంటాడు. హీరోగా నటిస్తాడు. దేనికైనా సిద్ధం అంటాడు. తాజాగా ఈయ‌న నటించిన ‘హిట్ 2’ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. దాంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ […]

  • By: krs    latest    Dec 27, 2022 6:09 AM IST
ఒక్కో ఫ్యామిలీలో డజనకు పైగా హీరోలు ఉన్నారు! అందుకే.. అవకాశాలు రావడం లేదు
  • టాలీవుడ్‌లో బంధుప్రీతి..
  • ఇక్కడ.. సైడ్ ఆర్టిస్ట్‌ల‌ కోసం మాత్రమే అడిషన్స్
  • వివాదాస్ప‌దం అవుతున్న శేష్‌ కామెంట్స్‌

విధాత: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం అడవి శేషు అనే చెప్పాలి. ఈయ‌న బ‌హుముఖ ప్రజ్ఞాశాలి. తానే స్క్రిప్టు రాసుకుంటాడు. అవసరమైతే తానే సొంతంగా నిర్మించుకుంటాడు. హీరోగా నటిస్తాడు. దేనికైనా సిద్ధం అంటాడు. తాజాగా ఈయ‌న నటించిన ‘హిట్ 2’ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. దాంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దం అవుతున్నాయి. బాలీవుడ్లో ఒక వెబ్ పోర్ట‌ల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్‌పై ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి చాలా ఎక్కువ. అందుకే మెయిన్ రోల్స్‌ చేయడానికి బయట వ్యక్తులను ఆడిషన్స్‌కి పిలిచే సాహసం చేయ‌రు.

టాలీవుడ్‌లో లీడ్ రోల్‌కి ఆడిషన్స్ అనే సంస్కృతి లేదు. ఆల్రెడీ హీరో ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచి నేరుగా లీడ్ రోల్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. మెయిన్ రోల్‌తో పాటు కీలక పాత్రల కోసం కూడా ఆడిషన్స్ జరగవు. కేవలం హీరో పక్కన ఉండే సైడ్ ఆర్టిస్ట్‌ల‌ కోసం మాత్రమే అడిషన్స్ జరుగుతాయి. ఒక్కో ఫ్యామిలీలో దాదాపు డజనకు పైగా హీరోలు ఉన్నారు.

అందుకే బయటి వారికి అవకాశాలు రావడం లేదు. మంచి కథలన్నీ మొదట వారసులకే వెళ్తాయి. వారిని దాటి పోయి రావాలంటే మన నెంబర్ ఎక్కడో ఉంటుంది. ఈ పద్ధతిని మార్చాలని నేను స్క్రిప్ట్ రాసుకోవడం మొదలు పెట్టాను. నేను నటించిన ఆరు సినిమాల్లో నాలుగు సినిమాల‌కు సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నాను.

అంతేగాని అన్నీ నాకే తెలుసు అనిపించుకోవడం కోసం నేను స్క్రిప్ట్ రాసుకోవడం లేదు. స్క్రిప్ట్ రాసుకోవడం వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే నాకు తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇక హిట్ 2 సినిమాలో అడవి శేష్ పోలీస్ అధికారిగా తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్ర‌స్తుతం మరికొన్ని స్క్రిప్ట్స్ మీద ఆయన వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.