విధాత: రానా దగ్గుబాటి.. తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన బాహుబలి చిత్రంలో భళ్లాలదేవగా అదరగొట్టాడు. మొదటి చిత్రం ‘లీడర్’ నుంచి ‘విరాటపర్వం’ వరకు ఆయన నటించిన చిత్రాలు విభిన్నమైన కథాంశాలతో కూడినవి కావడం విశేషం. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’, సాయి పల్లవితో విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి రానా ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ్‌తో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మెన్ వంటి సీరీస్‌లకు పని చేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తుండగా ఈ వెబ్ సిరీస్ భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇంతకు ముందు వెంకీ, రానా కలిసి కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో బళ్లారి బావ అనే పాటలో కలిసి నటించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో రానా దగ్గుబాటి శ్రీమతి మిహికా బజాజ్ కూడా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈమె వాలెంటైన్స్ డే పురస్కరించుకుని రానాతో కలిసి ఒక బ్యూటీఫుల్ పిక్‌ని షేర్ చేసింది.
‘నేను స్ట్రాంగ్, స్వీట్, ఎలిగెంట్ మరియు ప్రెట్టీ.. వైల్డ్ అండ్ వండర్ ఫుల్.. నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోవడానికి అడ్జెక్టివ్స్ సరిపోవడం లేదు.. నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడంలో ఆశ్చర్యమేమీ లేదు.. జస్ట్ కిడ్డింగ్.. నా కలలలోని రాకుమారుడు.. మోస్ట్ ఆఫ్ ది డేస్ నువ్వు నన్ను ఎనాయ్ చేస్తావ్ కానీ.. ఆ నవ్వు, నన్ను మళ్లీ మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది.. హ్యాపీ వాలంటైన్స్ డే రానా’ మిహీకా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
రానా దగ్గుబాటి, మిహికాలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు రానా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని, సినిమాలకు గుడ్‌బై చెప్పాడంటూ వార్తలు షికారు చేశాయి. ఇక తల్లిదండ్రులు కావడం విషయమై అలాంటిదేమైనా ఉంటే కచ్చితంగా చెప్తానని రానా క్లారిటీ ఇచ్చాడు. కాగా రానా మిహికాలు 2020 ఆగస్టు 8న వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.