శంక‌రా.. నాద‌శ‌రీరా ప‌రా.. అంటూ అద‌ర‌గొట్టిన స్కూల్ విద్యార్థులు.. వీడియో

చాలా మంది పిల్ల‌ల్లో తెలివితేట‌లు అధికంగా ఉంటాయి. త‌మ వ‌య‌సుతో సంబంధం లేకుండా త‌మకున్న నైపుణ్యంతో అద‌ర‌గొడుతుంటారు

శంక‌రా.. నాద‌శ‌రీరా ప‌రా.. అంటూ అద‌ర‌గొట్టిన స్కూల్ విద్యార్థులు.. వీడియో

విధాత: చాలా మంది పిల్ల‌ల్లో తెలివితేట‌లు అధికంగా ఉంటాయి. త‌మ వ‌య‌సుతో సంబంధం లేకుండా త‌మకున్న నైపుణ్యంతో అద‌ర‌గొడుతుంటారు. కొంద‌రు చ‌దువుల్లో, మ‌రికొంద‌రు ఆట‌ల్లో, ఇంకొంద‌రు ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో త‌మ జ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఆ మాదిరిగానే ఓ ఇద్ద‌రు విద్యార్థులు శంక‌రా భ‌ర‌ణంలోని పాట పాడి అద‌ర‌గొట్టారు. అది ఏ మ్యూజిక్ స్టూడియోలోనూ కాదు.. త‌మ స్కూల్‌లోనే.


శంక‌రా భ‌ర‌ణం సినిమాలో ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం పాడిన శంక‌రా.. నాద‌శ‌రీరా ప‌రా.. వేద‌విహారా హ‌రా.. జీవేశ్వ‌రా పాట‌ను అద్భుతంగా ఆల‌పించాడు ఓ విద్యార్థి. మ‌రో విద్యార్థి స్కూల్ బెంచ్‌, కంపాస్ బాక్స్‌పై సంగీతం ధ్వ‌నింప‌జేశాడు. ఇక ఆ గాత్రానికి త‌గ్గ‌ట్టుగా, సంగీతం ధ్వ‌నింప‌జేయ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ పిల్ల‌ల పాట‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు సైతం వారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు ఫిదా అవుతున్నారు. మంచి భ‌విష్య‌త్ ఉందంటూ ప్ర‌శంసిస్తున్నారు.


ఈ వీడియోను రాష్ట్ర పోలీసు శాఖ త‌మ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి, ప్ర‌శంసించింది. మ‌న దేశంలో బాల‌లు, యువ ప్ర‌తిభ‌కు కొద‌వ‌లేదు. తెలుసుకోవాల్సింది మంచి-చెడుల మ‌ధ్య ఉండే స‌న్న‌ని గీత మాత్ర‌మే. అది తెలుసుకుంటే యువ భార‌తం ఫ‌రిడ‌విల్లి ఆవిష్క‌ర‌ణ‌కు నిల‌యంగా మారుతుంద‌ని రాష్ట్ర పోలీసు శాఖ పేర్కొంది.