కన్న తండ్రే చంపేశాడు!

తన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని....వారికి మంచి భవిష్యత్‌ ఉండదని భావించిన ఓ తండ్రి వారిని చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కన్న తండ్రే చంపేశాడు!

The father killed his children!
విధాత : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రినే ఆ చిన్నారుల పాలిట కాలయముడై వారి ప్రాణాలు బలిగొన్నారుడు. ఈ తీవ్ర విషాద ఘటన కాకినాడ జిల్లాలోని సుబ్బారావు నగరల్ లో చోటుచేసుకుంది. తన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని….వారికి మంచి భవిష్యత్‌ ఉండదని భావించిన ఓ తండ్రి వారిని చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే తాడేపల్లి‌గూడెంకు చెందిన చంద్ర కిశోర్ వాకలపూడిలోని ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చంద్రకిశోర్‌కి భార్య తనూజ, ఇద్దరు కుమారుల సంతానం. సుబ్బారావు నగర్‌‌లో కుటుంబంతో కలిసి చంద్రకిశోర్ జీవిస్తున్నాడు. కుమారులు జోషిత్ (7) ఒకటో తరగతి, నిఖిల్ (6) యూకేజీ చదువుతున్నాడు.

హోలీ పండుగ సందర్భంగా ఆఫీసులో జరిగే సెలబ్రేషన్స్‌కు హాజరైన చంద్రకిషోర్ అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయాడు. భార్యను ఆఫీస్‌లోనే వెయిట్ చేయమని చెప్పాడు. అయితే భర్త ఎంతసేపటికి ఆఫీస్‌కి రాకపోవడంతో ఫోన్ చేసింది. ఫోన్‌కు సమాధానం లేకపోవడంతో కంగారుపడిన తనూజ తోటి ఉద్యోగులతో కలిసి సుబ్బారావు నగర్‌లోని తన ఇంటికి వెళ్లింది. తలుపులు ఓపెన్ చేయకుండా లోపల గడియపెట్టడంతో ఆమెకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ముగ్గురూ విగత జీవులుగా కనిపించారు.

పిల్లలను నీటిలో ముంచి హత్య
తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లగా అప్పటికే లోపల ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్రకిషోర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లల కాళ్లు చేతులకు తాళ్లు కట్టి వేయబడి బకెట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. తండ్రి చంద్రేశేఖర్ పిల్లల కాళ్లు చేతులకు తాళ్లు కట్టేసి ఆ బకెట్ నీటిలో ముంచి ఊపిరాడకుండా చంపేసినట్లుగా గుర్తించారు. పిల్లలు ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం చంద్రకిషోర్ సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళికట్టిన భర్త..కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు ఇలా మృత్యువాత పడటంతో తనూజ కుప్పకూలిపోయింది. ముగ్గురును పట్టుకుని బోరున విలపించిన తీరు అందర్నీ కంటతడిపెట్టించింది.

సంఘటన లో లభించిన సుసైడ్ నోట్ లో ‘ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని…వారికి భవిష్యత్తు లేదని…అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ పేర్కొన్నాడు. పిల్లల భవిష్యత్‌పై తరుచు చంద్రశేఖర్ బెంగ పెట్టుకునే వాడని..గతంలో చదివిన స్కూల్లో సరిగ్గా చదవడం లేదని ఇటీవలే వేరే స్కూల్‌లో చేర్చించాడని. అక్కడ కూడా సరిగా చదవడం లేదన్న కారణంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఉంటాడని సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపారు.