సీఎం అహంకారానికి పరాకాష్ట: ఎమ్మెల్యే ఈటల
ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించని సీఎం ఎస్సీలను అవమానించినట్టేనని ఈటల ఆగ్రహం పేదరైతులను బిచ్చగాళ్లుగా మార్చిన ధరణిపై మండిపాటు మహిళా సంఘాలకు బకాయి చెల్లించారా అని ప్రశ్న… విధాత: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి ఇది పరాకాష్ట అని, తెలంగాణలోని ఎస్సీలను అవమానపరిచినట్టేనని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. పేదల కొంపలు ముంచిన […]

- ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించని సీఎం
- ఎస్సీలను అవమానించినట్టేనని ఈటల ఆగ్రహం
- పేదరైతులను బిచ్చగాళ్లుగా మార్చిన ధరణిపై మండిపాటు
- మహిళా సంఘాలకు బకాయి చెల్లించారా అని ప్రశ్న…
విధాత: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి ఇది పరాకాష్ట అని, తెలంగాణలోని ఎస్సీలను అవమానపరిచినట్టేనని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
పేదల కొంపలు ముంచిన ధరణి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్నటి వరకూ సీఎం కార్యాలయంలో గిరిజన, దళిత, బీసీ, మైనారిటీలు ఒక్కరు కూడా లేరన్నారు. ఏడేళ్ల కాలంలో ఒక్క దళితుడికి భూమి ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో తనను మాట్లాడనివ్వలేదన్నారు. ధరణి రాష్ట్రంలోని పేదల కొంపలు ముంచిందని తెలిపారు.
పేదల బ్రతుకులు మారుతాయని అనుకుంటే.. చిన్న చిన్న భూములున్న పేద రైతులను బిచ్చగాళ్ళుగా మార్చారని అన్నారు. ధరణితో తన ఫ్యూడల్ భావజాలాన్ని సీఎం కేసీఆర్ బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. కోటి ఎకరాల మాగాణిలో ప్రతీ సంచిలో నాలుగు కిలోల ధాన్యం దండుకుంటున్నారని ఆరోపించారు. 2018 నుంచి మహిళా సంఘాలకు నాలుగువేలా ఐదు వందల బకాయిలు చెల్లించారా అని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
బీజేపీ పునరాలోచన
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీపై బీజేపీ పునరాలోచన చేస్తున్నది. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ ముందుగా భావించింది. అయితే బీఆర్‌ఎస్ ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో పునరాలోచనలో పడింది. నామినేషన్ల ఘట్టం ఎల్లుండితో ముగియనున్నది.