దారుణంగా కేసీఆర్ గ‌ల్లి రోడ్డు! 365 రోజులూ మురుగు నీరు పార‌కం

దారుణంగా కేసీఆర్ గ‌ల్లి రోడ్డు! 365 రోజులూ మురుగు నీరు పార‌కం
  • సీఎం ఇంటికి వెళ్లే బాట‌ గుంత‌లమ‌యం
  • 365 రోజులూ మురుగు నీరు పార‌కం
  • బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో
  • సీఎం సొంత ఇంటికి వెళ్లే దారి దారుణం


విధాత‌: ఇది మాములు గ్రామీణ రోడ్డు కాదు. వీఐపీల ఆడీ, బెంజ్, రోల్స్ రాయిస్ కార్లు వెళ్లే రోడ్డు. స్వ‌యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు సొంత నివాసానికి వెళ్లే బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్-14 ర‌హ‌దారి. సీఎం ఇంటికి వెళ్లే రోడ్డు అంటే అంద‌రూ అద్దంలా ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ, గుంతలమ‌యంతో దారుణంగా త‌యారైంది. ఏడాది పొడ‌వునా అక్క‌డ మురుగునీరు ప్ర‌వ‌హిస్తూనే ఉంటుంది. కంపు ముక్కుపుటాల‌ను బెద‌ర‌గొడుతూనే ఉంటుంది.


తాత్కాలికంగా మున్సిప‌ల్ సిబ్బంది చ‌ర్య‌లు చేప‌ట్టిన ఒక్క‌పూట మాత్ర‌మే మురుగునీటి ప్ర‌వాహం ఆగుతుంది. మ‌ళ్లీ మురుగు పారకం మామూలే. స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముక్కుమూసుకొని, మురుగు నీళ్ల‌లో న‌డ‌క సాగిస్తున్నారు. అయినా, ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. శాశ్వ‌త మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డం లేదు. సీఎం ఇంటి ర‌హ‌దారి ప‌రిస్థితే ఇట్లా ఉంటే.. రాష్ట్రంలో మిగ‌తా రోడ్ల ప‌రిస్థితి ఏమిటని ప్ర‌శ్నిస్తున్నారు.