జూడాలతో మంత్రి చర్చలు సఫలం

జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మంగళవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు.

  • By: Somu    latest    Dec 19, 2023 11:25 AM IST
జూడాలతో మంత్రి చర్చలు సఫలం
  • ప్రతినెల 15లోగా స్టైఫండ్ వేస్తామని హామీ


విధాత: జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మంగళవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. మంత్రితో తమ చర్చలు సఫలమయ్యాయని, సమ్మెకు వెళ్లడం లేదని జూడోలు ప్రకటించారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నెల 15 వరకు స్టెఫండ్ వచ్చాలే చూస్తామని మంత్రి జూడోలకు హామీ ఇచ్చారు.


హస్టళ్లలో వసతులు కల్పించడంతో పాటు కొత్త హాస్టల్స్ నిర్మిస్తామని, ఇతర సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామన్న మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు జూడోలు మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగాసమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ నిన్న హామీ ఇచ్చారు. మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని జూడాలతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె యోచనను విరమించుకున్నారు.