Bhuvanagiri: రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ.. ఎలా చేశారో చూడండి (Video)

దేవుళ్లకు తప్పని దొంగల బెడద.. సీసీ కెమెరాల్లో రికార్డ‌యిన దృశ్యాలు.. విధాత: దేవుళ్లకు సైతం దొంగల బెడద తప్పడం లేదు. వారికి దేవుడైనా, మనుషులైనా ఒక‌టే.. చోరీ చేయడానికి సొత్తు ఉంటే చాలు.. గుడిలో హుండీనైనా, ఆ దేవుడినైనా నిలువుగా దోచేస్తారు.  అలాంటి ఘ‌ట‌నే భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ గుడిలో చోటు చేసుకుంది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం […]

  • Publish Date - February 13, 2023 / 07:10 AM IST
  • దేవుళ్లకు తప్పని దొంగల బెడద..
  • సీసీ కెమెరాల్లో రికార్డ‌యిన దృశ్యాలు..

విధాత: దేవుళ్లకు సైతం దొంగల బెడద తప్పడం లేదు. వారికి దేవుడైనా, మనుషులైనా ఒక‌టే.. చోరీ చేయడానికి సొత్తు ఉంటే చాలు.. గుడిలో హుండీనైనా, ఆ దేవుడినైనా నిలువుగా దోచేస్తారు. అలాంటి ఘ‌ట‌నే భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ గుడిలో చోటు చేసుకుంది.

భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీలో నగదు చోరీ చేశారు. ఇద్దరు వ్యక్తులు హుండీ పగులగొట్టి దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హుండీలో సుమారు 40వేల నగదు ఉండొచ్చని పోలీసులు, పూజారులు భావిస్తున్నారు.

సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీని ఎవరు చేశారు.. స్థానికులా?.. లేక బయటి వ్యక్తులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఆలయంలో గతంలోనూ చోరీ జరిగినట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.