Drugs | డ్ర‌గ్స్‌కు బానిపై చనిపోతే ఖ‌ననానికి అనుమ‌తించం..

Drugs | దేశ వ్యాప్తంగా మాద‌క ద్ర‌వ్యాల స్మ‌గ్లింగ్ విప‌రీతంగా జ‌రుగుతోంది. దీంతో డ్ర‌గ్స్ వాడ‌కం అధిక‌మైపోయింది. చాలా మంది యువత డ్ర‌గ్స్ సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసోం మోరిగావ్ జిల్లాలోని క‌బ్రీస్తాన్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాద‌క ద్ర‌వ్యాల‌ను సేవించి, చ‌నిపోతే అలాంటి మృతుల అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌ద‌ని ఆదేశించింది. అంతేకాకుండా త‌మ స్మ‌శాన వాటిక‌ల్లో అలాంటి మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌డానికి అనుమ‌తించ‌మ‌ని తీర్మానం చేసింది. డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌తో పాటు విక్ర‌యాలు […]

Drugs | డ్ర‌గ్స్‌కు బానిపై చనిపోతే ఖ‌ననానికి అనుమ‌తించం..

Drugs | దేశ వ్యాప్తంగా మాద‌క ద్ర‌వ్యాల స్మ‌గ్లింగ్ విప‌రీతంగా జ‌రుగుతోంది. దీంతో డ్ర‌గ్స్ వాడ‌కం అధిక‌మైపోయింది. చాలా మంది యువత డ్ర‌గ్స్ సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసోం మోరిగావ్ జిల్లాలోని క‌బ్రీస్తాన్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మాద‌క ద్ర‌వ్యాల‌ను సేవించి, చ‌నిపోతే అలాంటి మృతుల అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌ద‌ని ఆదేశించింది. అంతేకాకుండా త‌మ స్మ‌శాన వాటిక‌ల్లో అలాంటి మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌డానికి అనుమ‌తించ‌మ‌ని తీర్మానం చేసింది. డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌తో పాటు విక్ర‌యాలు జ‌రిపే వారికి కూడా ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

మాద‌క ద్ర‌వ్యాల‌ను అరిక‌ట్టేందుకు, డ్ర‌గ్స్‌కు యువ‌త బానిస కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌బ్రీస్తాన్ క‌మిటీ పేర్కొంది. డ్ర‌గ్స్ వాడ‌కం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌రిణామాల‌పై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని తెలిపింది.

క‌బ్రీస్తాన్ క‌మిటీ నిర్ణ‌యంపై అసోం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ స్పందించారు. డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు గ‌త రెండేండ్ల నుంచి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం తెలిపారు. డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తున్న 9,309 మందిని అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. రూ. 1430 కోట్ల విలువ చేసే మాద‌క ద్ర‌వ్యాల‌ను సీజ్ చేసిన‌ట్లు చెప్పారు. 420 ఎక‌రాల్లో పండించిన గంజాయిని కూడా ధ్వంసం చేశామ‌న్నారు.