తోట పవన్‌పై దాడి చేసింది.. MLA వినయ్, విజయ్ భాస్కర్, కిరణ్ అనుచరులు

సుందర్ రాజ్, అజీజ్ ఖాన్ వ్యాఖ్యలు అర్దరహితం మీడియా సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై దాడికి ఎమ్మెల్యే(MLA) వినయభాస్కర్ కారణమని, కావాలనే వేరే వారి మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ‌హించాల్సిందే. ఎమ్మెల్యే నాయకత్వంలో విజయ్ భాస్కర్, సోడా కిరణ్‌లు గుండాలను పెంచి  పోషిస్తున్నారు అంటూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి(Rajendr Reddy) […]

  • By: Somu    latest    Feb 23, 2023 11:08 AM IST
తోట పవన్‌పై దాడి చేసింది.. MLA వినయ్, విజయ్ భాస్కర్, కిరణ్ అనుచరులు
  • సుందర్ రాజ్, అజీజ్ ఖాన్ వ్యాఖ్యలు అర్దరహితం
  • మీడియా సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై దాడికి ఎమ్మెల్యే(MLA) వినయభాస్కర్ కారణమని, కావాలనే వేరే వారి మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ‌హించాల్సిందే. ఎమ్మెల్యే నాయకత్వంలో విజయ్ భాస్కర్, సోడా కిరణ్‌లు గుండాలను పెంచి పోషిస్తున్నారు అంటూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి(Rajendr Reddy) విమర్శించారు.

    కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పవన్ పై దాడిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి MLA వినయ్ భాస్కర్ ముఖ్య అనుచరుడు.. గంజాయిమత్తులో గుండాలు విచ్చలవిడిగా దౌర్జన్యాలు దాడులు చేస్తూ ప్రజలను భయపెట్టిస్తున్నారని విమర్శించారు.

    శివాజీ(Shivaji) మహారాజ్ పై తోట పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేసాడన్న అభియోగంతో బిజేపి కార్యకర్తలు దాడి చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ వైరంతో తోట పవన్ పై దాడి చేయడానికి ముందు నుంచే పక్కా ప్రణాళికతో (sketch)బిఆర్ఎస్ పార్టీ గూండాలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

    నిందితులు A1 చెక్క సుమన్, (డబ్బాల్) A2 నరేందర్, (సోడా కిరణ్ PA), A3 వినోద్ (రెడ్డి కాలనీ), A4 కృష్ణ, A5 అభిలాష్ (అభి), టెంట్ హౌస్ విజయ్, ముర్తజ BRS డివిజన్ ప్రెసిడెంట్, దామెర సాండి, చిలువేరు నరేష్, రాజ్ కుమార్, (గోకుల్ నగర్), శ్రీకాంత చారి(TJSF) సిటీ ప్రెసిడెంట్ వీరంతా MLA వినయ్ భాస్కర్, విజయ్ భాస్కర్, సోదా కిరణ్ అనుచ‌రులే అని ఆరోపించారు.

    అధికార దాహంతో భూకబ్జాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యంలో అభివృద్ధి పై ప్రశ్నిస్తే మాపై దాడులు చేయిస్తావా ? పోలీస్ అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయాన్ని కాపాడాలని కోరారు. ప్రెస్ మీట్ పెట్టిన KUDA చైర్మన్ సుందర్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్, మాజీ కార్పోరేటర్లకు బీఆర్ఎస్ నాయకులకు వాస్తవాలు కండ్లకూ కనిపించడం లేదా ? అంటూ నాయిని ప్రశ్నించారు.

    ఈ మీడియా సమావేశంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పోరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, బంక సరళ, మాజీ కార్పోరేటర్ నసీం జహాన్ తదితరులు పాల్గొన్నారు.