సీఎంపైకి కుర్చీ విసిరివేత.. భద్రతా సిబ్బంది అప్రమత్తం
విధాత: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. నితీశ్ పైకి విరిగిన ప్లాస్టిక్ కుర్చీ విసిరేశాడు. ఈ ఘటన ఔరంగాబాద్‌లోని బరూన్ బ్లాక్‌లో నిన్న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బరూన్ బ్లాక్‌లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు నితీశ్ కుమార్ వెళ్లారు. అయితే పంచాయతీ భవనం వద్దకు ర్యాలీగా వెళ్తున్న సమయంలో.. ఓ వ్యక్తి సీఎంపైకి కుర్చీ విసిరేశాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. నితీశ్‌కు […]

విధాత: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. నితీశ్ పైకి విరిగిన ప్లాస్టిక్ కుర్చీ విసిరేశాడు. ఈ ఘటన ఔరంగాబాద్‌లోని బరూన్ బ్లాక్‌లో నిన్న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బరూన్ బ్లాక్‌లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు నితీశ్ కుమార్ వెళ్లారు.
అయితే పంచాయతీ భవనం వద్దకు ర్యాలీగా వెళ్తున్న సమయంలో.. ఓ వ్యక్తి సీఎంపైకి కుర్చీ విసిరేశాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. నితీశ్‌కు కొంచెం దూరంలో కుర్చీ పడింది. సీఎంకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
భద్రతా సిబ్బంది సీఎంకు చేతులు అడ్డుపెట్టి.. పంచాయతీ భవనం వద్దకు తీసుకెళ్లారు. అయితే చైర్ విసిరిన వ్యక్తి కోసం ఔరంగాబాద్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రోహతస్ జిల్లాలోనూ సీఎం నితీశ్ పర్యటించారు.
అక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. లిక్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విద్యార్థిని సలోనిని సీఎం మెచ్చుకున్నారు. మద్యపానం వలన కలిగే నష్టాల గురించి ఆ బాలిక విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. బీహార్‌లో 2016, ఏప్రిల్ నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతోంది.
#WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR
— ANI (@ANI) February 13, 2023