Tiger | పంట పొలాల మ‌ధ్య పులి సంచారం.. భ‌య‌ప‌డ‌కుండా వీడియో తీసిన రైతు

Tiger | ఓ పెద్ద పులి.. పచ్చ‌ని పంట పొలాల మ‌ధ్య సంచ‌రిస్తోంది. అదే పొలంలో ఓ రైతు ట్రాక్ట‌ర్‌చే పొలం దున్నుతున్నాడు. మ‌రో రైతేమో.. పులి సంచ‌రిస్తున్న దృశ్యాన్ని త‌న మొబైల్ ఫోన్‌లో చిత్రీక‌రించాడు. పెద్ద పులి మాత్రం ఆ ఇద్ద‌రు రైతుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో చోటు చేసుకున్న‌ట్లు వైర‌ల్ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను ట్విట్ట‌ర్ యూజ‌ర్ రాజ్ ల‌ఖానీ త‌న ఖాతాలో షేర్ చేసుకున్నాడు. […]

Tiger | పంట పొలాల మ‌ధ్య పులి సంచారం.. భ‌య‌ప‌డ‌కుండా వీడియో తీసిన రైతు

Tiger | ఓ పెద్ద పులి.. పచ్చ‌ని పంట పొలాల మ‌ధ్య సంచ‌రిస్తోంది. అదే పొలంలో ఓ రైతు ట్రాక్ట‌ర్‌చే పొలం దున్నుతున్నాడు. మ‌రో రైతేమో.. పులి సంచ‌రిస్తున్న దృశ్యాన్ని త‌న మొబైల్ ఫోన్‌లో చిత్రీక‌రించాడు. పెద్ద పులి మాత్రం ఆ ఇద్ద‌రు రైతుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో చోటు చేసుకున్న‌ట్లు వైర‌ల్ వీడియోలో పేర్కొన్నారు.

ఈ వీడియోను ట్విట్ట‌ర్ యూజ‌ర్ రాజ్ ల‌ఖానీ త‌న ఖాతాలో షేర్ చేసుకున్నాడు. పంట పొలాల్లో పెద్ద పులి తాపీగా సంచ‌రించింద‌ని పేర్కొన్నాడు. అక్క‌డ పొలం దున్నుతున్న రైతుకు, వీడియో చిత్రీక‌రించిన మ‌రో రైతుకు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు.

ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి 1.20 ల‌క్ష‌ల మంది వీక్షించారు. 2 వేల మంది లైక్ చేశారు. ఇది అద్భుత దృశ్యం అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. జంతువులు, మ‌న‌షులు ప్ర‌కృతితో మమేకానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. అయితే రైతులు పని చేసే పొలాల్లో పులి సంచారం పట్ల మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. తినడానికి ఏదీ లభించకపోతే పులి గడ్డి తింటుందా? అని ఒకరు చమత్కరించారు.