గణపథ్ టీజర్ విడుదల చేసిన చిరు.. కల్కితో పోలికలు ఉన్నాయంటూ పోస్ట్‌లు

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం గణపథ్. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదలకానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం మొదలు పెట్టింది. ఇప్పటికే ‘గణపథ్’ మూవీకి సంబంధించి విడుదలైన టైగర్ ష్రాఫ్, కృతిసనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా చిత్ర టీజర్ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
టీజర్ చూస్తే.. ఫ్యూచరస్టిక్ యాక్షన్ సినిమాగా ఉంటుందని తెలుస్తోంది. 1.45 నిమిషాల వ్యవధి ఉన్న ఈ టీజర్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సూపర్బ్‌గా ఉంది. టీజర్ ప్రారంభంలో టైగర్ ష్రాప్ గుహలో ధ్యానం చేస్తూ కనిపిస్తూ ఉండగా, ఈ సినిమా 2070 ADలో జరుగుతున్నట్లు చూపించారు. మనకోసం ఓ వీరుడు వచ్చేంత వరకు ఈ యుద్ధం మొదలు పెట్టొద్దు” అనే వాయిస్ వినిపించగానే, గుహలో ధ్యానం చేసుకుంటున్న టైగర్ దర్శనమిస్తారు. టైగర్‌ని చంపేందుకు సరికొత్త ఆయుధాలతో ఓ బృందం వెళుతుంది. వారిని చితకబాదినట్టు చూపిస్తారు.
ఇక చిత్ర కథానాయిక కృతి సనన్ కూడా యాక్షన్ అవతార్‌లో కనిపించి అలరించింది. మొత్తంగా ఫ్యూచరస్టిక్ యాక్షన్ మూవీగా గణపథ్ ఉండనుందని ఈ టీజర్‌ని చూస్తే అర్ధమవుతుంది.ఇక చిత్ర టైటిల్‍కు ఏ హీరో ఈజ్ బార్న్ అనే క్యాప్షన్ పెట్టడంతో అందరిలో ఆసక్తి కలుగుతుంది. అయితే ఈ చిత్రం ప్రభాస్ కల్కి మూవీ మాదిరిగా ఉంటుందని అర్ధమవుతుంది.
ఫ్యూచరిస్టిక్ థీమ్‌తో రెండు చిత్రాలు రూపొందుతుండగా, కల్కి చిత్రంలో మహావిష్ణువు 10వ అవతారమైన కల్కిగా నటిస్తున్నారు ప్రభాస్. గణ్‍పథ్ చిత్రంలో వినాయకుడికి హీరో పాత్రకు సంబంధం ఉందని అర్ధమవుతుంది. అమితాబ్ పాత్ర రెండు చిత్రాలలో ఒకే మాదిరిగా ఉంటుందని అంటున్నారు. టీజర్లో కొన్ని పోలికలు కనిపిస్తుండగా, కథ, బ్యాక్‍డ్రాప్ సహా చాలా విషయాల్లో కల్కి 2898 ఏడీ, గణపథ్ వేర్వేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.