Bengal Panchayat Election Result | బెంగాల్ టీఎంసీదే.. రెండో స్థానంలో బీజేపీ
Bengal Panchayat Election Result విధాత: పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 63229 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మంగళవారం సాయంత్రానికి తృణమూల్ కాంగ్రెస్‌కు 12518 స్థానాలు రాగా, బీజేపీకి 2781 స్థానాలు లభించాయి. మెజారిటీ స్థానాల్లో తృణమూల్ ఆధిక్యత కొనసాగుతున్నది. వామపక్ష సంఘటనకు 959 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 625 స్థానాలు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన ఐఎస్ఎఫ్ 219 స్థానాలు లభించాయి. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు 718 […]

Bengal Panchayat Election Result
విధాత: పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 63229 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మంగళవారం సాయంత్రానికి తృణమూల్ కాంగ్రెస్‌కు 12518 స్థానాలు రాగా, బీజేపీకి 2781 స్థానాలు లభించాయి.
మెజారిటీ స్థానాల్లో తృణమూల్ ఆధిక్యత కొనసాగుతున్నది. వామపక్ష సంఘటనకు 959 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 625 స్థానాలు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన ఐఎస్ఎఫ్ 219 స్థానాలు లభించాయి. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు 718 స్థానాల్లో విజయం సాధించారు. అంతేగాక 9730 పంచాయతీ సమితి స్థానాలు, 928 జిల్లాపరిషత్ స్థానాలలో కూడా ఓట్ల లెక్కింపు జరుగుతున్నది.
అలాగే 928 జిల్లా పరిషత్ స్థానాల్లో141 స్థానాల ఫలితాలు వెలువడగా తృణమూల్ 122 స్థానాల్లో, బీజేపీ 18 స్థానాల్లో, వామ పక్షాలు ఒక స్థానాలు విజయం సాధించాయి. పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చెలరేగడం, తృణమూల్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో 80.71 శాతం పోలింగ్ జరిగింది.