Rasi Phalalu: 25.02.2025, మంగ‌ళ‌వారం.. నేటి మీ రాశి ఫలాలు! ఆ రాశుల వారి జీతభత్యాలు పెరుగుతాయి

  • By: sr    latest    Feb 25, 2025 9:16 AM IST
Rasi Phalalu: 25.02.2025, మంగ‌ళ‌వారం.. నేటి మీ రాశి ఫలాలు! ఆ రాశుల వారి జీతభత్యాలు పెరుగుతాయి

Rasi Phalalu|

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచినప్ప‌టి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు (మంగ‌ళ‌వారం, ఫిబ్ర‌వ‌రి 25)న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. రుణ బాధలు పోతాయి. వ్యాపారాల్లో తీరిక లేని పరి స్థితి ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం . నూతన కార్యాలకు ఆటంకాలు. చేసే ప‌నుల్లో సత్ఫలితాలు.

వృషభం
సంతృప్తికరంగా వృత్తి, వ్యాపారాలు. స్థానచలన సూచనలు. సన్నిహితులతో విరోధం వ‌చ్చే అవ‌కాశం.. ఆకస్మిక ధననష్టం. ఉత్సాహంగా కుటుంబ జీవితం. ముఖ్య కార్యక్రమాలు వాయిదా ప‌డుతాయి. స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు. వృధా ప్రయాణాలు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం. ప్రతీ విషయంలో వ్యయ, ప్రయాసలు.

మిథునం
తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం. ఆకస్మిక ధనయోగం. శుభవార్తలు వింటారు. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు. వృత్తి, వ్యాపార లాభాల్లో వృద్ధి. ఓ ముఖ్యమైన కార్యక్రమం పూర్తి. అనవసర భయాలు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం.

కర్కాటకం
అదనపు ఆదాయప్రయత్నాలు సఫలం. బంధుమిత్రులతో స్నేహ‌పూర్వ‌కంగా ఉండాలి. ఆకస్మిక కలహాలు వ‌చ్చే అవ‌కాశం. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం. ధన నష్టం, రుణ ప్రయత్నాలు. ప్రయత్నకార్యాల్లో ఆటంకాలు. ప్రశాంతంగా కుటుంబ జీవితం. కుటుంబ విషయాల్లో మార్పులు. అనవసర వ్యయప్రయాసలు. బంధువులతో కలిసి దైవ ద‌ర్శ‌ణాలు చేసుకుంటారు.

సింహం
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం. అనుకున్న ప‌నులు జ‌రుగ‌వు. స్వ‌ల్ప‌ అనారోగ్య స‌మ‌స్య‌లు. వేళకు భోజ‌నం చేయ‌డానికి ప్రాధాన్యం. వ్యాపారంలో పోటీ. మ‌న‌స్థితి వ‌ళ్ల కొన్ని ఇబ్బందులు. ఆదాయంలో నిలకడ. పిల్లల విష‌యంలో శ్రద్ధగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు.ఆకస్మిక ధననష్టం. నూతన కార్యాలు వాయిదా. నిలకడగా ఆరోగ్యం.

కన్య
ప్రోత్సాహకరంగా వృత్తి, ఉద్యోగాల వాతావరణం. స్త్రీల వ‌ళ్ల ధన లాభం. ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో వృద్ధి. ఆత్మీయులను కలవడంలో విఫలం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విష‌యంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది.

తుల
ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. నిరుద్యోగులకు అవకాశాలు. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు. త‌ల‌పెట్టిన ప‌నుల్లో అన్నింటా విజయం. బంధు, మిత్రులు కలుస్తారు. కళల్లో ఆసక్తి. అధికారులకు మీ మీద నమ్మ కం పెరుగుతుంది.

వృశ్చికం
ఉత్సాహంగా కుటుంబ జీవితం. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం, సంతృప్తికరంగా వృత్తి జీవితం. ఆకస్మిక భయాందోళనలు దూరం. బంధు, మిత్రులతో వైరం. వ్యాపారంలో నిలకడగా లాభాలు, ఆరోగ్యం. రహస్య శతృబాధలు. రుణప్రయత్నాలు ఆలస్యం. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం. కుటుంబంలో మనశ్శాంతి ఉండ‌దు.

ధనుస్సు
జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న వృద్ధి. ఆకస్మిక ధనలాభం. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు. ముఖ్యమైన కార్యాలు పూర్తి. సులభంగా శుభకార్య ప్రయత్నాలు తీరుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మకరం
ఉద్యోగంలో ఆదరాభిమానాలు. నూతన కార్యాలు ఆలస్యం. అనారోగ్య స‌మ‌స్య‌లు. ఓ విషయం వ‌ళ్ల‌ మనస్తాపం. ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. అబ‌ద్దాల‌కు దూరంగా ఉండాలి. అనవసర భయాందోళనలు. అస్థిరమైన నిర్ణయాలు. ఆకస్మిక ధనవ్యయం. జీవిత భాగ స్వామితో క‌లిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులకు సా యం చేస్తారు.

కుంభం
కొత్త‌ వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తీరుతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మనోల్లాసం పొందుతారు. సోదరులతో వైరం రాకుండా చూసుకోవాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు. అస్థిర నిర్ణయాలు. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గం చూసుకోవాలి. నిరుద్యోగులకు దూరంగా ఉద్యోగం ల‌భించే అవ‌కాశం.

మీనం
నిలకడగా వ్యాపారాలు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. సొంత ప‌నుల‌పై శ్రద్ధ అవ‌స‌రం. రుణబాధలు,శత్రుబాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు. అంతటా అనుకూల వాతావరణం. ధన రూపేనా వాగ్దానాలు చేయకపోవడం మంచిది.