తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు
తెలంగాణలో మంగళవారం పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు

విధాత : తెలంగాణలో మంగళవారం పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ సీపీగా సుధీర్‌బాబును, హైద్రాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిలను నియమిస్తు డీజీపీ ఆదేశాలిచ్చారు.
తెలంగాణ ఐపీఎస్‌ల బదీలల్లో భాగంగా ఈ మార్పులు చేశారు. సైబారాబాద్ సీపీగా అవినాష్ మొహంతి, యాండి నార్కోటింగ్ వింగ్ డైరక్టర్‌గా సందీప్ శాండిల్యాలను నియమించింది. ప్రస్తుతం రాచకొండ, హైద్రాబాద్ సీపీలుగా ఉన్న చౌహాన్, ఆనంద్‌లను డీజీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారాలు చేపట్టాకా గత బీఆరెస్ ప్రభుత్వ హాయంలో ఆ ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసిన అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ బదిలీల ప్రక్రియను ముమ్మరం చేస్తుంది.