ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టొరీ

పవన్ ను వదలని బీజేపీ జనసేనతోనే పొత్తంటున్న కమలం బాబే ముద్దంటున్న పవన్ ఉన్నమాట: హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు.. కానీ మరో అమ్మాయిని ప్రేమిస్తాడు.. హీరోను తన వైపు తిప్పుకోవాలని ఇద్దరు అమ్మాయిలూ తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.. దీన్నే ట్రయాంగిల్ లవ్ స్టొరీ అంటారు.. అచ్చం అలాంటి సన్నివేశమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. జనసేనని పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీతో వెళ్లాలని భావిస్తున్నారు. ఇటు మరోవైపు బీజేపీతో బంధం కొనసాగుతూనే పవన్ మాత్రం టీడీపీవైపు మొగ్గు చూపుతున్నారు. అదే […]

  • By: krs    latest    Oct 25, 2022 3:40 PM IST
ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టొరీ
  • పవన్ ను వదలని బీజేపీ
  • జనసేనతోనే పొత్తంటున్న కమలం
  • బాబే ముద్దంటున్న పవన్

ఉన్నమాట: హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు.. కానీ మరో అమ్మాయిని ప్రేమిస్తాడు.. హీరోను తన వైపు తిప్పుకోవాలని ఇద్దరు అమ్మాయిలూ తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.. దీన్నే ట్రయాంగిల్ లవ్ స్టొరీ అంటారు.. అచ్చం అలాంటి సన్నివేశమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది.

జనసేనని పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీతో వెళ్లాలని భావిస్తున్నారు. ఇటు మరోవైపు బీజేపీతో బంధం కొనసాగుతూనే పవన్ మాత్రం టీడీపీవైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో బీజేపీ మాత్రం పవన్‌ను వదులుకునేందుకు నచ్చడం లేదు. మొత్తానికి ఇలా ఉంది ఏపీలో పొలిటికల్ ట్రయాంగిల్
లవ్ స్టొరీ.

విశాఖ ర్యాలీ అనంతరం కాస్త హైప్ ను తన ఖాతాలో వేసుకున్న పవన్ విజయవాడ వెళ్లి వెళ్ళగానే చంద్రబాబు వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ పరిణామం ఇపుడు ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. మున్ముందు టీడీపీతో కలిసి వెళ్లాలని పవన్.. చంద్రబాబు కూడా ప్రకటించారు. ఈ పాయింట్ ఇప్పుడు బీజేపీని ఇరిటేట్ చేస్తోంది.

ఆల్రెడీ తమతో పొత్తులో ఉన్న పవన్ మళ్ళీ ఇప్పుడు టీడీపీతో ఎలా వెళ్తారూ అని బీజేపీ లోలోన ఫీలవుతోంది. ఈమేరకు ఆ పార్టీ ఏపీ వ్యవహరాల ఇంచార్జి సునీల్ డియోధర్ అయితే వైసీపీ టీడీపీ రెండూ కుటుంబ పార్టీలు అని విమర్శించారు.

తమకు ఏపీలో ఒకే ఒక పార్టీతో పొత్తు ఉందని అది జనసేన మాత్రమే అన్నారు. ఇక టీడీపీ జనసేన చేతులు కలిపినా బీజేపీ కోసం ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబుకు అయితే బీజేపీ తమతో జట్టు కట్టాలని 2014 నాటి పొత్తులు రిపీట్ కావాలని ఉంది.

మరో వైపు పవన్ కూడా బీజేపీతో బంధం తెంచుకుంటున్నామని చెప్పడంలేదు. దీంతో ఆంధ్రాలో టిడిపి బిజేపీ పవన్ కలిసి వెళ్తారా.. పవన్ టీడీపీతో వెళతారా.. బీజేపీతో కలిసి నడుస్తారా అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. మున్ముందు ఇది ఎటు తిరుగుతుందో చూడాలి..