Breaking: టీఆర్ఎస్‌కు షాక్.. BJPలోకి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్?
విధాత: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు పార్టీ వీడి కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడు సీటు ఆశించిన ఆయన టికెట్ దక్కక పోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అంతేగాక తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇటీవలే బహిరంగంగానే అధిష్టానంపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బూర నర్సయ్య గౌడ్ బండి సంజయ్, తరుణ్ చుగ్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నదని […]

విధాత: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు పార్టీ వీడి కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.


మునుగోడు సీటు ఆశించిన ఆయన టికెట్ దక్కక పోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అంతేగాక తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇటీవలే బహిరంగంగానే అధిష్టానంపై విమర్శలు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీలో బూర నర్సయ్య గౌడ్ బండి సంజయ్, తరుణ్ చుగ్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.