RTC Bill
విధాత, టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశ పెట్టిన బిల్లుకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ మూడు దఫాలుగా పలు అంశాలపై అభ్యంతరాలను లెవనెత్తి ప్రభుత్వ వివరణలు కోరగా, ప్రభుత్వం అంతే వేగంగా వివరణలు సమర్పించింది. అటు ఆర్టీసీ కార్మికులు సైతం ఆందోళనకు దిగడం, వారితో గవర్నర్ చర్చలు జరుపడం, చివరకు పది సిఫారసులతో గవర్నర్ తమిళ సై ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును ఆమోదించి ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వానికి పంపడం జరిగింది.
ప్రభుత్వానికి ఆర్టీసీ బిల్లు అందగానే రవాణా శాఖ మంత్రి పువ్వాల అజయ్ కుమార్ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టగా, చర్చ పిదప అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉత్కంఠ పరిణామాల అనంతరం చివరకు ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించడంతో ఆర్టీసీ కార్మికులలో హర్షం వ్యక్తమవుతుంది.