వైద్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వరుస ఉద్యోగ నియామకాలతో జోరుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది

విధాత, హైదరాబాద్ : వరుస ఉద్యోగ నియామకాలతో జోరుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది. వైద్యశాఖలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
5348 పోస్టుల భర్తీలో భాగంగా ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో సైతం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కూడా చేపట్టనున్నారు. వైద్యారోగ్య శాఖ సర్వీసుల బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ ప్రకటించిన విధంగా వైద్యశాఖలో ఖాళీల భర్తీ జరుగుతుండటంతో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.