TSRTC | ప్రయాణికులపై.. TSRTC టోల్‌ బాదుడు.. అమల్లోకి కొత్త ఛార్జీలు

విధాత: పెరిగిన టోల్‌ ఛార్జిలను ప్రయాణికులపై వేయాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. జాతీయ రహదారుల టోల్‌ గేట్‌ ఛార్జీలు 5 శాతం పెంచడంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త ఛార్జీలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. ఆర్డినరీ నుంచి గరుడ బస్సుల్లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ ప్లాజా ఛార్జీలను రూ. 4 రూపాయలు పెంచినట్టు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. నాన్‌ ఏసీ స్లీపర్‌ సెల్‌ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్‌ సెల్‌ […]

  • Publish Date - April 2, 2023 / 02:48 AM IST

విధాత: పెరిగిన టోల్‌ ఛార్జిలను ప్రయాణికులపై వేయాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. జాతీయ రహదారుల టోల్‌ గేట్‌ ఛార్జీలు 5 శాతం పెంచడంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త ఛార్జీలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.

ఆర్డినరీ నుంచి గరుడ బస్సుల్లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ ప్లాజా ఛార్జీలను రూ. 4 రూపాయలు పెంచినట్టు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

నాన్‌ ఏసీ స్లీపర్‌ సెల్‌ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్‌ సెల్‌ బస్సులో రూ. 20 చొప్పున ప్రయాణికుల నుంచి టోల్‌ ప్లాజా వసూలు చేయాలని నిర్ణయించింది. టోల్‌ ప్లాజా మీదుగా హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న కొన్ని ఆర్డినరీ బస్సుల్లోనూ టికెట్‌ ధర రూ. 4 పెంచినట్టు ఆర్టీసీ తెలిపింది.

Latest News