వీక్షకులను ఫూల్స్‌ని చేస్తున్న టీవీ ఛానల్స్!
విధాత: జబర్దస్త్‌కి కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె కన్నడ భామ సౌమ్యా రావు. ఈ సౌమ్యరావుతో రష్మి గౌతమ్ గొడవకు దిగింది. నువ్వు రాగానే నేను వెళ్లి పోవడానికి నేనేమైనా పాత యాంకర్స్‌ని అనుకుంటున్నావా అని అడిగేసింది. నయా యాంకర్ సౌమ్యా రావు కూడా ఏమాత్రం తగ్గకుండా షాకింగ్ రిప్లై ఇచ్చేసింది. దీంతో అక్కడే ఉన్న జడ్జి ఇంద్రజ కలుగజేస్తుంది. విషయంలోకి వెళ్తే శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ స్పెషల్ […]

విధాత: జబర్దస్త్‌కి కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె కన్నడ భామ సౌమ్యా రావు. ఈ సౌమ్యరావుతో రష్మి గౌతమ్ గొడవకు దిగింది. నువ్వు రాగానే నేను వెళ్లి పోవడానికి నేనేమైనా పాత యాంకర్స్‌ని అనుకుంటున్నావా అని అడిగేసింది.
నయా యాంకర్ సౌమ్యా రావు కూడా ఏమాత్రం తగ్గకుండా షాకింగ్ రిప్లై ఇచ్చేసింది. దీంతో అక్కడే ఉన్న జడ్జి ఇంద్రజ కలుగజేస్తుంది. విషయంలోకి వెళ్తే శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ని మరింత ప్రత్యేకంగా ఫుల్ ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దాంతో భాగంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్స్, కమెడియన్స్‌ని రంగంలోకి దింపారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆల్రెడీ రష్మీ చేస్తుంది. 100వ ఎపిసోడ్‌లో కొత్త యాంకర్ సౌమ్యరావు పాల్గొంది. ఈ వేదికపై సౌమ్యరావును చూసిన రష్మీ వాదనకు దిగింది. ఆ ముగ్గురు పాత యాంకర్స్ లాగా కొత్త యాంకర్ రాగానే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అంది. దానికి సౌమ్యా రావ్ తగ్గకుండా టైమింగ్ కౌంటర్ ఇచ్చింది.
జబర్దస్త్ పాత యాంకర్స్ ముగ్గురు కాదు నీతో కలిపి నలుగురు అని సెటైర్ వేసింది. వీరి మధ్య మాటలు పెరుగుతుండగా జడ్జి ఇంద్రజ ఎంటర్ అయ్యింది. మీలో ఎవరు జబర్దస్త్ యాంకర్‌గా ఉండాలో తేల్చడానికి పోటీ పెట్టుకుందాం. ఇద్దరూ మీ టీమ్స్‌ని సిద్ధం చేసుకుని పెర్ఫార్మన్స్ ఇవ్వండి. బాగా ఎంటర్టైన్ చేసిన టీం గెలిచి జబర్దస్త్ యాంకర్‌గా కొనసాగవచ్చని ఛాలెంజ్ ఇచ్చింది. రష్మీ, సౌమ్య ఈ ఛాలెంజ్‌ని ఒప్పుకొని దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చారు.
సౌమ్య రావు హాఫ్ శారీలో పుష్ప చిత్రంలోని చూపే బంగారమాయనే సాంగ్ కి డాన్స్ చేసింది. రష్మీ మాచర్ల నియోజకవర్గం మూవీలోని హిట్ సాంగ్ రెడ్డి సాంగ్ కి మాస్ స్టెప్స్ తో కేక పుట్టించింది. అయితే రష్మీ, సౌమ్య మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. నిజంగా వారు ఎలాంటి గొడవ పడలేదు.
అనసూయ జబర్దస్త్ మానేశాక ఆ ప్లేస్ లో రష్మీ కొనసాగింది. ప్రస్తుతం సౌమ్యరావును జబర్దస్త్ యాంకర్‌గా తీసుకున్నారు. సౌమ్య రావు రాకతో రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రమే పరిమితమైంది. ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్త్ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయింది.
అయితే కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంట్రీపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్మీ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌తో అంటే గతంలో సుధీర్, రష్మీల పెళ్లిలా.. ఆ తర్వాత ఇమ్మానుయేల్, వర్షల పెళ్లిలా.. ఇప్పుడు ఈ ఇద్దరు యాంకర్స్ మధ్య గొడవ అంటూ.. సదరు ఛానల్ వీక్షకులను ఫూల్స్‌ని చేస్తోంది.