Chandrababu | చంద్రబాబుకు ఐటీ నోటీసులు.. కేసులో ఇద్దరు పరారీ
Chandrababu విధాత: టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, దానికి ప్రతిగా భారీగా చంద్రబాబు ముడుపులు తీసుకున్న అంశానికి సంబంధించి ఇప్పుడు ఇంకో పరిణామం జరింగింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇద్దరూ విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది. షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల తరఫున కన్సల్టెంట్ గా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ ఆఫీసుల్లో ఐటి సోదాలు జరిగినపుడు దొరికిన పత్రాలు ఆధారంగా చంద్రబాబుకు […]

Chandrababu
విధాత: టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, దానికి ప్రతిగా భారీగా చంద్రబాబు ముడుపులు తీసుకున్న అంశానికి సంబంధించి ఇప్పుడు ఇంకో పరిణామం జరింగింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇద్దరూ విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల తరఫున కన్సల్టెంట్ గా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ ఆఫీసుల్లో ఐటి సోదాలు జరిగినపుడు దొరికిన పత్రాలు ఆధారంగా చంద్రబాబుకు అయన రూ. 118 కోట్లు ముట్టజెప్పినట్లు తేలింది. ఇదిప్పుడు ఆంధ్రాలో హాట్ టాపిక అయింది. అయితే ఈ కేసులో సీఐడీ సైతం దర్యాప్తు చేసేందుకు సిద్ధం అయింది.
అయితే మనోజ్ వాసుదేవ్ ఈనెల 5న దుబాయ్ పారిపోయారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస రావు కూడా ఈనెల 6న అమెరికాకు పరారయ్యారు. ఇక మరో కుంభకోణం అయిన స్కిల్ డెవలమెంట్ స్కాములో కీలకవ్యక్తి , షెల్ కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా మాత్రం ఐటీ విచారణకు హాజరవుతానని తెలిపారు.
టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు అందినట్లు ఆధారాలు దొరికాయి. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో గత వారం తనిఖీలు చేపట్టారు.
అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా చంద్రబాబు కుమారుడు లోకేష్ సైతం దాదాపు పాతిక కోట్లు తీసుకున్నట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారు. డబ్బును తమ అనుచరులకు విశాఖ, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు తీసుకెళ్లి ఇచ్చినట్లు వాసుదేవ్ ఐటి అధికారులకు వెల్లడించారు. కోటి అంటే టన్ను అని, డబ్బు అంటే స్టీల్ అని కోడ్ భాష ఉపయోగించి డబ్బును ట్రాన్స్ఫర్ చేసినట్లు ఐటి అధికారులు గుర్తించారు.