Saleshwaram | సలేశ్వరం జాతరలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు మృతి

విధాత: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతర (Saleshwaram Festival)లో విషాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందారు. సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తడంతో కనుమ లోయ దారిలో లింగమయ్యను దర్శించుకునేందుకు సాగుతున్న క్రమంలో జనం రద్దీ అధికమై నాగర్ కర్నూల్‌కు చెందిన చంద్రయ్య, వనపర్తి అభిషేక్, మరో వ్యక్తి ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. లక్షలాదిగా భక్తులు ఒక్కసారిగా తరలిరావడం వారి రాకపోకలకు అటవీ ,పోలీస్ శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ […]

  • By: Somu    latest    Apr 06, 2023 10:58 AM IST
Saleshwaram | సలేశ్వరం జాతరలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు మృతి

విధాత: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతర (Saleshwaram Festival)లో విషాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందారు.

సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తడంతో కనుమ లోయ దారిలో లింగమయ్యను దర్శించుకునేందుకు సాగుతున్న క్రమంలో జనం రద్దీ అధికమై నాగర్ కర్నూల్‌కు చెందిన చంద్రయ్య, వనపర్తి అభిషేక్, మరో వ్యక్తి ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం.

లక్షలాదిగా భక్తులు ఒక్కసారిగా తరలిరావడం వారి రాకపోకలకు అటవీ ,పోలీస్ శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం నెలకొందని తెలుస్తుంది.