Nalgonda | విద్యుత్ తీగలు మీద పడి ఒకరు మృతి.. యాక్సిడెంట్‌లో మరొకరు
విధాత: సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామంలో మండు సతీష్ రెడ్డి విద్యుత్ షాక్ గురై దుర్మరణం చెందాడు. వరి కోత మిషన్లను లీజుకు నడిపించే సతీష్ రెడ్డి గ్రామ శివారులో పొలంపై వరి కోత పనుల నిమిత్తం పొలం మీదుగా వెళుతున్న 11కేవీ విద్యుత్ తీగలను కర్ర సహాయంతో పైకి లేపాడు. ఈ ప్రయత్నంలో తీగ తెగి అతని మీద పడడంతో విద్యుత్ శాఖ గురై అక్కడికక్కడే చనిపోయాడు. అదేవిధంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు దుబ్బ […]

విధాత: సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామంలో మండు సతీష్ రెడ్డి విద్యుత్ షాక్ గురై దుర్మరణం చెందాడు.
వరి కోత మిషన్లను లీజుకు నడిపించే సతీష్ రెడ్డి గ్రామ శివారులో పొలంపై వరి కోత పనుల నిమిత్తం పొలం మీదుగా వెళుతున్న 11కేవీ విద్యుత్ తీగలను కర్ర సహాయంతో పైకి లేపాడు. ఈ ప్రయత్నంలో తీగ తెగి అతని మీద పడడంతో విద్యుత్ శాఖ గురై అక్కడికక్కడే చనిపోయాడు.
అదేవిధంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు దుబ్బ తండ వద్ద ట్రాక్టర్ బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో రాగడప గ్రామానికి చెందిన రేలా సైదులు మృతి చెందాడు.