Underworld | పాతాళ లోకంలో ఎవ‌రెస్టు క‌న్నా ఎత్తైన ప‌ర్వ‌తాలు..

Underworld విధాత‌: భూమ్మీద ఎత్తైన ప‌ర్వ‌తం ఏది అని ఎవ‌రైనా అడిగితే.. ఏం చెబుతారు? ఎవ‌రెస్ట్ (Everest) అనే క‌దా… కానీ అది అబ‌ద్ధం. స‌ముద్ర మ‌ట్టం క‌న్నా ఎత్తులో అయితేనే ఎవ‌రెస్టు.. ఎక్కువ భాగం ప‌సిఫిక్‌లో ఉంటూ పైకి చిన్న‌గా క‌నిపించే మౌంట్ కియానే అస‌లు సిస‌లు అతి ఎత్తైన ప‌ర్వతం. తాజాగా శాస్త్రవేత్త‌లు (Scientists) ఈ రెండింటినీ త‌ల‌ద‌న్నే ప‌ర్వ‌తాలూ ఉన్నాయ‌ని చెబుతున్నారు. అదీ భూమి మీదే.. ఎక్క‌డో తెలుసా? పాతాళ లోకంలో.. భూ […]

Underworld | పాతాళ లోకంలో ఎవ‌రెస్టు క‌న్నా ఎత్తైన ప‌ర్వ‌తాలు..

Underworld

విధాత‌: భూమ్మీద ఎత్తైన ప‌ర్వ‌తం ఏది అని ఎవ‌రైనా అడిగితే.. ఏం చెబుతారు? ఎవ‌రెస్ట్ (Everest) అనే క‌దా… కానీ అది అబ‌ద్ధం. స‌ముద్ర మ‌ట్టం క‌న్నా ఎత్తులో అయితేనే ఎవ‌రెస్టు.. ఎక్కువ భాగం ప‌సిఫిక్‌లో ఉంటూ పైకి చిన్న‌గా క‌నిపించే మౌంట్ కియానే అస‌లు సిస‌లు అతి ఎత్తైన ప‌ర్వతం. తాజాగా శాస్త్రవేత్త‌లు (Scientists) ఈ రెండింటినీ త‌ల‌ద‌న్నే ప‌ర్వ‌తాలూ ఉన్నాయ‌ని చెబుతున్నారు. అదీ భూమి మీదే.. ఎక్క‌డో తెలుసా?

పాతాళ లోకంలో..

భూ అంత‌రాల‌లో ఎత్తులో ఎవ‌రెస్టును మించిపోయే ప‌ర్వ‌తాలు (Mountains) చాలా ఉన్నాయ‌ని శాస్త్రవేత్త‌లు ప్ర‌క‌టించారు. అంటార్కిటికా (Antarcitica) లో ఉన్న సెసిమాల‌జీ కేంద్రాల నుంచి ప‌రిశోధ‌న‌లు చేయ‌గా.. భూ గ‌ర్భంలో ఉన్న కొన్ని ప‌ర్వ‌త స‌మూహాలు వారి దృష్టిలో ప‌డ్డాయి. ఇందులో కొన్న ఏకంగా ఎవ‌రెస్టు కంటే ఐదు లేదా ఆరు రెట్లు ఎత్తుగా ఉండ‌టంతో శాస్త్రవేత్త‌లు ఆశ్చ‌ర్య‌పోయారు.

భూమి పొర‌ల్లో మాంటిల్‌, కోర్ మ‌ధ్య‌లో ఈ ప‌ర్వ‌తాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్వ‌తాల రూపం, వాటి స్థితి భూమి మీద ఉన్న ప‌ర్వ‌తాల‌తో స‌రిపోలుతున్నాయ‌ని శాస్త్రవేత్త‌లు త‌మ నివేదిక‌లో ప్ర‌స్తావించారు.

ఎలా క‌నుగొన్నారు..?

భూమి పొర‌ల‌ను, అక్క‌డి ప‌రిస్థితుల‌ను క‌నుగొన‌డానికి శాస్త్రవేత్తలు భూకంపాలనే ఉప‌యోగించుకుంటారు. భూ కంపాలు వ‌చ్చిన‌పుడు కొన్ని త‌రంగాలు విడుద‌ల‌వుతుంటాయి. ఇవి ఒక్కో పొర‌లో ఒక్కో వేగంతో ప్ర‌యాణిస్తాయి. అలా ప్ర‌పంచంలోని కొన్ని ప‌రిశోధ‌న కేంద్రాల ద్వారా ఈ సెస్మిక్ త‌రంగాల‌ను శాస్త్రవేత్త‌లు అధ్య‌య‌నం చేసి ఫొటోలు త‌యారుచేస్తారు.

ఇదే త‌ర‌హాలో అంటార్కిటికా కేంద్రంలో 25 ఏళ్లుగా సేక‌రించిన డేటాను విశ్లేషించి పాతాళంలో ఉన్న ప‌ర్వ‌తాల గురించి ప‌రిశోధ‌కులు స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. భూమి లోప‌ల ఉన్న ఘ‌న కోర్‌, ద్ర‌వ మాంటిల్ మ‌ధ్య ఉన్న ఖాళీ ప్రాంతంలో ఈ భారీ ప‌ర్వ‌తాలు ఉన్నాయ‌ని గుర్తించారు. అయితే ఇవి ఎలా ఏర్ప‌డ్డాయి. ఎందుకు ఏర్ప‌డ్డాయి. ఏ మెటీరియ‌ల్‌తో ఏర్ప‌డ్డాయ‌నే విష‌యాలపై ఇంకా ప‌రిశోధ‌న చేయాల్సి ఉంది.

పురాతన స‌ముద్రాల్లో ఉండే సున్నం లాంటి మెటీరియ‌ల్ వ‌ల్లే ఈ ప‌ర్వ‌తాలు ఏర్ప‌డి ఉంటాయ‌ని కొంత మంది ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. రెండు టెక్టానిక్ ప్లేట్లు క‌లుసుకునే ప్రాంతంలో సీ బెడ్‌లో ఉండే లవ‌ణాలు, ఖ‌నిజాలు భూగ‌ర్భంలో ఇంకిపోయి ఉండొచ్చు. ఇలా కొన్ని కోట్ల కోట్ల సంవ‌త్స‌రాల పాటు జ‌రిగిన అనంత‌రం ఇలాంటి భారీ ప‌ర్వ‌తాలు రూపుదిద్దుకొని ఉండొచ్చ‌ని ఒక అంచ‌నా.