UP | తీవ్ర వాగ్వాదం.. భర్త పురుషాంగాన్ని కోసేందుకు భార్య యత్నం
UP | Crime News | విధాత: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య చెలరేగిన ఘర్షణ.. భర్త పురుషాంగాన్ని కోసే దాకా దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వరుణ్ విహార్ వృత్తిరీత్యా క్లీనర్. వరుణ్‌కు వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య జూన్ 14వ తేదీన తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భార్య.. భర్తను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఇక అదే రోజు భర్త గాఢ నిద్రలోకి […]

UP | Crime News |
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య చెలరేగిన ఘర్షణ.. భర్త పురుషాంగాన్ని కోసే దాకా దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వరుణ్ విహార్ వృత్తిరీత్యా క్లీనర్. వరుణ్‌కు వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య జూన్ 14వ తేదీన తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భార్య.. భర్తను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది.
ఇక అదే రోజు భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత బ్లేడ్‌తో అతని పురుషాంగాన్ని కోసేందుకు భార్య యత్నించింది. అప్రమత్తమైన భర్త గట్టిగా కేకలు వేయడంతో భార్య అటు నుంచి పారిపోయింది.
అయితే ఈ ఘటన జరిగిన రోజే బయటకు చెప్పేందుకు భర్త ఇష్టపడలేదు. మొత్తానికి రెండు రోజుల క్రితం బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.