Chicken Man | ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాలన్న లక్ష్యంతో, ప్రత్యేక గుర్తింపు సాధించాలన్న తపనతో.. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నో స్టంట్లు చేసి నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతుండగా, మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఓ వ్యక్తి కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సాహసమే చేశాడు. ఏకంగా 40 రోజుల్లో 40 కోళ్లను తినేశాడు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే అమెరికాకు వెళ్లాల్సిందే.
అమెరికాలోని ఫిలడేల్పియాకు చెందిన అలెగ్జాండర్ టామిన్ స్కీ(31) హోటల్ లో సర్వర్ గా పని చేస్తున్నాడు. అయితే తాను ఏదో సాధించాలనుకున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో రోజుకు ఒక కోడి చొప్పున 40 రోజుల్లో 40 కోళ్లను తినాలనుకున్నాడు. ఇంకేముంది.. తన మదిలో వచ్చిన ఆలోచనను అమలు చేసేశాడు. ఇక బాగా ఉడికించిన కోడిని.. ఒకే సమయంలో పూర్తిగా తినేశాడు.
అలా ప్రతి రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో కోడిని తినడం మొదలుపెట్టి.. ఎలాంటి విరామం లేకుండా, 40 రోజుల్లో 40 కోళ్లను తినేశాడు. నవంబర్ 6వ తేదీన తన టాస్క్ ను పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఫిలడెల్ఫియా చికెన్ మ్యాన్ గా గుర్తింపు పొందాడు. చివరి రోజు తన టాస్కును చూసేందుకు 500 మంది తరలివచ్చారు.
39 consecutive days eating an entire rotisserie chicken #chicken pic.twitter.com/hOrDUX3GIF
— smooth recess (@AlexiconTom) November 5, 2022