అమెరికాలో మరో భారతీయుడు హత్య

అగ్రరాజ్యంలో భారతీయుల భద్రతపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇండియన్స్ లక్ష్యంగా జరిగిన దాడుల్లో, ఇప్పటివరకు వందలాది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

  • By: Somu    latest    Mar 02, 2024 11:35 AM IST
అమెరికాలో మరో భారతీయుడు హత్య

వాషింగ్టన్ : అగ్రరాజ్యంలో భారతీయుల భద్రతపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇండియన్స్ లక్ష్యంగా జరిగిన దాడుల్లో, ఇప్పటివరకు వందలాది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలపై ఇటీవల అమెరికా ప్రభుత్వ పెద్దలు కూడా విచారం వ్యక్తం చేశారు. అయినా కూడా హ‌త్య‌ల పంప‌ర మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో భారతీయుడు హ‌త్య‌కు గ‌ర‌య్యాడు. దీంతో ప్రవాస భారతీయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.


ఫిబ్రవరి 23 తేదీన‌ గుర్తు సిక్కులకు సంబంధించిన ప్రార్థ‌న‌ కార్యక్రమం కోసం, అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజాసింగ్ అలియాస్ గోల్డి (23) ను తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు.ఈ ఘటన వివరాల్లోకి వెళితే, అలబామాలోని గురుద్వారాలో జ‌రిగిన‌ సంగీత కార్యక్రమంలో పాల్గొని బయటికి వచ్చిన రాజాసింగ్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌లు జ‌రిపిన కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో రాజాసింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.


రాజాసింగ్ స్వ‌గ్రామం ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా , సాహు . ఐదేళ్ల క్రితమే రాజాసింగ్ తండ్రి మరణించాడు. కుటుంబమంతా, రాజాసింగ్ సంపాదన పైనే ఆధారపడి ఉంది. రాజాసింగ్ కు తల్లి, సోదరుడు సోదరీమణులు ఉన్నారు . రాజాసింగ్ మృతదేహాన్ని భారత్ తీసుకు వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా అతడి కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని, బాధిత కుటుంబీకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


ఏడాదిన్నరగా రాజాసింగ్ అక్కడే యూఎస్ లోనే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగినా, విచారణ జరుగుతున్నా, నిందితులు ఇంకా పట్టుబడలేదు. అమెరికా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరుస ఘటనలపై స్పంధిస్తూ, విచారణ జరిపి నిందితులను త్వరలో అరెస్టు జేస్తామని అంటున్నారు కానీ ఆదిశ‌గా చ‌ర్య‌లున్న‌ట్లు క‌నిపించ‌డం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. భ‌విష్య‌త్‌లో ఇలాంటి సంఘ‌టనలు జ‌రుగ‌వ‌నే గ్యారంటీ లేద‌న్న భ‌యం అక్క‌డి భార‌తీయుల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.