వాల్మీకి బోయ‌ల‌ను ST జాబితాలో చేర్చాలి

విధాత‌: హైదరాబాద్‌లోని న్యాయ శాఖ మంత్రి కార్యాలయంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వాల్మీకి బోయలను ST జాబితాలో చేర్చాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, Dr. VM అబ్రహం వివ‌రించారు. చెల్లప్ప కమిషన్ వాల్మీకి బోయ కులాన్ని షెడ్యూల్డ్ తెగల(ST) జాబితాలో చేర్చాలని సిపార్సు చేసిన విష‌యం విధిత‌మే. చెల్ల‌ప్ప సిఫార్సు అమ‌లుపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, V. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అడిషనల్ అడ్వ‌కేట్ […]

  • Publish Date - November 25, 2022 / 04:34 PM IST

విధాత‌: హైదరాబాద్‌లోని న్యాయ శాఖ మంత్రి కార్యాలయంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వాల్మీకి బోయలను ST జాబితాలో చేర్చాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, Dr. VM అబ్రహం వివ‌రించారు.

చెల్లప్ప కమిషన్ వాల్మీకి బోయ కులాన్ని షెడ్యూల్డ్ తెగల(ST) జాబితాలో చేర్చాలని సిపార్సు చేసిన విష‌యం విధిత‌మే. చెల్ల‌ప్ప సిఫార్సు అమ‌లుపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, V. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అడిషనల్ అడ్వ‌కేట్ జనరల్, లా సెక్రెటరీలతో చ‌ర్చించారు.

వాల్మీకి బోయ కులాలను ST జాబితాలోకి మార్చాలని చెల్లప్ప కమిషన్ చేసిన సిఫార్సుల అమలుపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప‌ జేయాల‌ని త‌ద‌నంత‌రం కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు అవసరమైన న్యాయ పరమైన అంశాలపై చ‌ర్చించేందుకే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి నాయకులు రమేష్ నాయుడు, బైండింగ్ రాములు, కోటేష్, పాండు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.