UPSC సెక్రటరీగా వసుధ మిశ్రా పునర్నియామకం
విధాత: సీనియర్ ఐఏఎస్ 1987 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ అధికారిణి వసుధ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పునర్నియామకం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ విభాగం సెక్రటరీ దీప్తి ఉమా శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. వసుధ మిశ్రా 2023 మార్చి 1వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి29వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

విధాత: సీనియర్ ఐఏఎస్ 1987 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ అధికారిణి వసుధ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పునర్నియామకం చేసింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ విభాగం సెక్రటరీ దీప్తి ఉమా శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. వసుధ మిశ్రా 2023 మార్చి 1వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి29వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.