వటపత్ర శాయిగా యాదగిరీశుడు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి వటపత్ర శాయి అలంకార సేవను యాజ్ఞీక, అర్చక పండిత బృందం శాస్త్రయుక్తంగా నిర్వహించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు

- హంహవాహనంపై విహారం
విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి వటపత్ర శాయి అలంకార సేవను యాజ్ఞీక, అర్చక పండిత బృందం శాస్త్రయుక్తంగా నిర్వహించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. సింహరూపుడైన నరసింహుడు పసిబాలుడై వటపత్ర శాయి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని వటపత్ర శాయిగా దర్శించుకున్న భక్తులు స్వామివారి లీలవిశేషాలను స్మరిస్తూ తరించారు.
సాయంత్రం స్వామివారు హంసవాహన రూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానానికి సంకేతమైన హంసవాహన సేవలో విహరించిన లక్ష్మీనరసింహుడి దర్శనంతో భక్తులలోని అజ్ఞాన చీకట్లు తొలగి దివ్యజ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మురళీకృష్ణ అలంకార సేవ, పొన్న వాహన సేవలను నిర్వహించనున్నారు. అలాగే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగనున్నాయి.