Vatte Janaiah | కూకట్‌పల్లి: కిడ్నాప్‌ చేసి.. 30 లక్షలు కాజేశాడు! వెలుగులోకి వట్టే జానయ్య అరాచకాలు!

Vatte Janaiah | రైస్ మిల్ లో నిర్బంధించి చిత్రహింసలు పోలీసులకు దంపతుల ఫిర్యాదు విధాత, హైదరాబాద్: నరరూప రాక్షసుడు నయీం ముఠాను మించి సూర్యాపేటకు చెందిన వట్టే జానయ్య యాదవ్ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేట జిల్లానే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే 80 మందికి పైగా బాధితులు వివిధ పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేసిన విషయం మరువక ముందే, తాజాగా కూకట్ పల్లికి చెందిన దంపతులు […]

  • Publish Date - August 28, 2023 / 01:13 PM IST

Vatte Janaiah |

  • రైస్ మిల్ లో నిర్బంధించి చిత్రహింసలు
  • పోలీసులకు దంపతుల ఫిర్యాదు

విధాత, హైదరాబాద్: నరరూప రాక్షసుడు నయీం ముఠాను మించి సూర్యాపేటకు చెందిన వట్టే జానయ్య యాదవ్ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేట జిల్లానే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే 80 మందికి పైగా బాధితులు వివిధ పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేసిన విషయం మరువక ముందే, తాజాగా కూకట్ పల్లికి చెందిన దంపతులు తెరపైకి వచ్చారు.

తమను కిడ్నాప్ చేసి 30 లక్షలు కాజేశాడని ఆరోపిస్తూ, జానయ్యతో పాటు ఆయన కుమారుడు గణేష్, అనుచరుడు వెంకట్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. తమను కిడ్నాప్ చేసి సూర్యాపేట సమీపంలోని వజ్ర రైస్ ఇండస్ట్రీలో నిర్బంధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారని కూకట్ పల్లికి చెందిన మమత, ఆమె భర్త చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు సంబంధం లేని విషయంలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. వారి బెదిరింపులకు భయపడి విడతల వారీగా ముప్పై లక్షలు చెల్లించామని వాపోయారు.

కాగా.. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం పోలీసులకు అందజేశారు. అయ్యప్పమాలలో ఉండి కూడా జానయ్య అనుచరులు తాము ఉంటున్న బాలాజీ రెసిడెన్సీకి వచ్చి భయబ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేసిన వీడియో లను సైతం బాధితురాలు మమత పోలీసులకు అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.