Viral Video | పెన్ష‌న్ క‌ష్టాలు.. మండుటెండ‌లో చెప్పుల్లేకుండా న‌డిచిన వృద్ధురాలు

Viral Video | ఓ వృద్ధురాలికి పెన్ష‌న్ కష్టాలు తెచ్చిపెట్టింది. పెన్ష‌న్ తీసుకొచ్చుకునేందుకు ఆ వృద్ధురాలు మండుటెండ‌లో కాలికి చెప్పుల్లేకుండా కిలోమీట‌ర్ల న‌డిచి వెళ్లింది. ఓ విరిగిన కుర్చీ సాయంతో బ్యాంక్‌కు చేరుకున్న వృద్ధురాలి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఒడిశాలోని న‌బ్రంగ్‌పూర్ జిల్లాకు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు సూర్య హ‌రిజ‌న్‌కు ప్ర‌భుత్వం పెన్ష‌న్ ఇస్తోంది. అయితే పెన్ష‌న్ డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాలి. అయితే జ‌రిగావ్ బ్లాక్ నుంచి ఆమె విరిగిన కుర్చీ […]

Viral Video | పెన్ష‌న్ క‌ష్టాలు.. మండుటెండ‌లో చెప్పుల్లేకుండా న‌డిచిన వృద్ధురాలు

Viral Video |

ఓ వృద్ధురాలికి పెన్ష‌న్ కష్టాలు తెచ్చిపెట్టింది. పెన్ష‌న్ తీసుకొచ్చుకునేందుకు ఆ వృద్ధురాలు మండుటెండ‌లో కాలికి చెప్పుల్లేకుండా కిలోమీట‌ర్ల న‌డిచి వెళ్లింది. ఓ విరిగిన కుర్చీ సాయంతో బ్యాంక్‌కు చేరుకున్న వృద్ధురాలి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఒడిశాలోని న‌బ్రంగ్‌పూర్ జిల్లాకు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు సూర్య హ‌రిజ‌న్‌కు ప్ర‌భుత్వం పెన్ష‌న్ ఇస్తోంది. అయితే పెన్ష‌న్ డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాలి.

అయితే జ‌రిగావ్ బ్లాక్ నుంచి ఆమె విరిగిన కుర్చీ సాయంతో.. మండుటెండ‌లో బ్యాంక్‌కు బ‌య‌ల్దేరింది. కానీ బ్యాంక్‌కు వెళ్లిన త‌ర్వాత వృద్ధురాలికి నిరాశే ఎదురైంది. ఆమె ఫింగ‌ర్ ప్రింట్స్.. బ్యాంకులో న‌మోదైన రికార్డ్స్‌కు మ్యాచింగ్ కాలేదు. దీంతో ఆమె ఇంటికి తిరిగి వెళ్లింది.

ఈ ఘ‌ట‌న‌పై ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజ‌ర్ స్పందించారు. ఆమె ఫింగ‌ర్ ప్రింట్స్ బ్యాంక్ రికార్డుల‌కు మ్యాచింగ్ అవ‌డం లేద‌న్నారు. వృద్ధురాలి స‌మ‌స్య‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తాం. అయితే మ్యాన్‌వ‌ల్‌గా రూ. 3 వేలు అందించిన‌ట్లు బ్యాంక్ మేనేజ‌ర్ పేర్కొన్నారు.