Vijay Devarakonda | కాబోయే వధువుని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ.. త్వరలో పెళ్లి?
Vijay Devarakonda | టాలీవుడ్ యువ హీరోలందరు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే శర్వానంద్ వివాహం జరగగా, త్వరలో వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ దేవరకొండ కొద్ది సేపటి క్రితం తన ఇన్‌స్టా స్టోరీలో ..‘చాలా జరుగుతాయి.. కానీ, ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది - త్వరలోనే ప్రకటిస్తా’ అంటూ ఒక ఫోటో షేర్ […]

Vijay Devarakonda |
టాలీవుడ్ యువ హీరోలందరు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే శర్వానంద్ వివాహం జరగగా, త్వరలో వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ దేవరకొండ కొద్ది సేపటి క్రితం తన ఇన్‌స్టా స్టోరీలో ..‘చాలా జరుగుతాయి.. కానీ, ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది – త్వరలోనే ప్రకటిస్తా’ అంటూ ఒక ఫోటో షేర్ చేశాడు.
ఇందులో విజయ్ దేవరకొండ మరో అమ్మాయి చేతిని పట్టుకున్నట్టు ఉంది. అచ్చం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పట్టుకున్నట్టుగా ఉండడంతో ఇప్పుడు ఈ ఫొటోపై జోరుగా చర్చ నడుస్తుంది.
విజయ్ ప్రత్యేకంగా ఈ పోస్ట్ షేర్ చేయడంతో ఇది ప్రేమ కానీ, పెళ్లి గురించి కానీ అయ్యుండొచ్చని అందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ లేడి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి కొందరు ఇది సినిమా ప్రమోషన్ భాగం అని అంటున్నారు.
ఇటీవల కొందరు సెలబ్రిటీలు ఇలానే తమ సినిమాల ప్రమోషన్ కోసం ట్రిక్స్ ప్లే చేస్తూ ఫ్యాన్స్‌ని పిచ్చోళ్లని చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేతికి వాచ్ ఉంది. కాబట్టి, ఇది వాచ్ ప్రమోషన్ అయి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఈ స్టోరీ మీద అందరిలో అనేక రకాల అనుమానాలు ఏర్పడ్డాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక చివరిగా లైగర్ చిత్రంతో తీవ్ర నిరాశపరచిన విజయ్ దేవరకొండ సెప్టెంబర్ 1న ఖుషి చిత్రంతో పలకరించబోతున్నాడు. సమంతతో కలిసి విజయ్ నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.
మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చగా, ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. మూవీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ‘ఖుషి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.