Vijay-Samantha |
సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ఖుషి. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పాటల ద్వారా ఈ చిత్రానికి మంచి హైప్ రాగా, రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా ఎంతో ఆకట్టుకుంది.ఇక మ్యూజిక్ కాన్సెర్ట్‌లో విజయ్, సమంత డ్యాన్స్ తో పాటు వారు చేసిన సందడి ప్రత్యేకంగా మారింది.
విజయ్, సమంత, శిర్వాణ గత సినిమాలు ఫ్లాప్ కావడంతో ఖుషి సినిమా ఈ ముగ్గురికి కీలకం కానుంది. ఇందుకోసం మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సమంతకి అర్ధరాత్రి కాల్ చేసి ఫన్నీగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశాడు.
వీడియెలో సమంత.. ఏమైంది.. అంతా బాగానే ఉందా అడగగా దానికి విజయ్ .. “నిన్ను మిస్ అవుతున్నా. నాక్ నాక్ జోక్ చెప్తా” అని విజయ్ అన్నారు. అర్ధరాత్రి 1.30 అవుతోందని.. ఇప్పుడు జోకా అన్నట్టు సమంత అనడంతో విజయ్ దేవరకొండ.. ‘నా రోజా నువ్వే’ అంటూ పాట పాడారు.
అయితే, ఇది వీడియో కాల్ కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఎందుకు అంత యాక్టింగ్.. అది నిజంగా వీడియో కాల్ కాదు’ అని అన్నారు. అర్దరాత్రి వీడియో కాల్‌లో మాట్లాడుకుంటున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు కాని సమంత కళ్లజోడు పెట్టుకోవడంతో అది రికార్డ్ చేసిన వీడియో అని అందరికి అర్ధమైంది.
మయోసైటిస్ చికిత్స కోసం అని సమంత న్యూయర్క్ వెళ్లగా, అక్కడ తెగ రచ్చ చేస్తుంది. విజయ్ దేవరకొండ మాత్రం ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకొని పలు ప్రాంతాలు చుట్టేస్తున్నాడు. గత వారం కోయంబత్తూరు వెళ్లి కోలీవుడ్, మాలీవుడ్ మీడియాతోనూ ముచ్చటించిన విజయ్ ఇంతవరకు బాలీవుడ్ మీడియా ముందుకు మాత్రం వెళ్లలేదు.
చూస్తుంటే ఖుషి సినిమాను కేవలం సౌత్‌కే పరిమితం చేసేలా కనిపిస్తుంది. సాంగ్స్ మాత్రం జనాలలోకి బాగా వెళ్లడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. లైగర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఖుషీ కాగా, ఈ సినిమా ఎంతలా అలరిస్తుందో చూడాలి.