విధాత: వైఎస్సార్సీపీలో (YSRCP) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రాజకీయ ప్రత్యర్థుల మీద నిత్యం ట్విట్టర్, పేసుబుక్ వంటి మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టి వెక్కిరించే విజయసాయి రెడ్డి ఈ మధ్య ఎందుకో కూల్ అయ్యారు. ఎక్కడా సందడి లేదు.
మొన్న జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడ జగన్‌ను స్వాగతించిన ఎంపీల్లో అయన కూడా కనిపించారు తప్పితే ఆయన మిగతా చోట్ల ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబును, ఎల్లో మీడియాను, ముఖ్యంగా రామోజీ రావును ట్విట్టర్లో ఒక అట ఆడుకునే విజయసాయి రెడ్డి ఈమధ్య అసలు పబ్లిక్ ప్రోగ్రాముల్లో ఎక్కడా కనిపించడం లేదు.. అసలు ఏమయ్యారు.
అన్నిటికన్నా ముఖ్యంగా తానూ తరచూ వాదులాడే రామోజీ రావును ఆయన మంచం మీద ఉండగా సీఐడీ వాళ్ళు విచారించిన ఫోటోలు బయటికి వచ్చాయి. ఇవి కాస్తా చర్చకు దారి తీశాయి. వాస్తవానికి రామోజీ రావును (Ramoji Rao) విచారించడం అనేది విజయసాయి రెడ్డికి చాలా సంతోషం కలిగించే విషయం.
కానీ దీని మీద కూడా అయన ఎక్కడా స్పందించలేదు. మామూలుగా అయితే ఆయన ట్విట్టర్, ఫెసుబుక్కులో వరుస ట్వీట్లతో పండగ చేసుకునే వారు కానీ ఇంత పెద్ద ఘటన జరిగిన తరువాత కూడా అయన కిమ్మనకుండా ఉండడం దేనికి సంకేతం అనేది అర్థం కానీ విషయం.
మరోవైపు ఆయన్ను ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ పదవి నుంచి తప్పించిన ముఖ్యమంత్రి ఆయనకు ఢిల్లీలో పార్టీ బాధ్యతను, సమన్వయము చేసే పని అప్పగించారు. విశాఖను తన అడ్డాగా చేసుకుని మూడేళ్ళుగా రాజయోగం, అపరిమిత అధికారాలు చెలాయించిన విజయసాయి రెడ్డిని అక్కడ్నుంచి తప్పించడంతో ఆయన అలకబూనారని అంటున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డిని (YS Subbareddy) జగన్ నియమించడంతో ఆయన కార్యరంగంలోకి దూకారు. తనకు ప్రాధాన్యం తగ్గించారని అలిగి విజయసాయి రెడ్డి (Y.VIjayasai Reddy) రెరవెనక్కు వెళ్లారని అంటున్నారు. లేకుంటే రామోజీ విచారణ సమయంలో అయన సోషల్ మీడియాలో శివ తాండవం చేసేవారని, కానీ ఇప్పుడు కిమ్మనకుండా ఉంటున్నారంటే అదే కారణం అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.