విధాత : కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి తనదైన శైలిలో ట్వీట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై 420హామీలు అంటూ బీఆరెస్ బుక్ లెట్ విడుదల చేయడంపై ఆమె మండిపడ్డారు. ట్వీట్టర్ వేదికగా బీఆరెస్‌పైన, కేసీఆర్‌పైన విమర్శలు గుప్పించారు. బీఆరెస్ అంటే భవిష్యత్ రహిత సమితి అని విమర్శించారు. ఆ పార్టీ నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని పరిస్థితికి చేరుకున్నట్లు కనబడుతోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచే ఎన్నికల హామీల అమలును ఒక్కోక్కటిగా చేస్తుండగానే 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం విడుదల చేశారని తప్పుబట్టారు. అదికూడా బీఆరెస్ ప్రభుత్వం దుర్మార్గంగా తెలంగాణ నెత్తిన 6 లక్షల కోట్లు అప్పు పెట్టిన అంశం వారే సిగ్గులేక యాదిమరిచారని ఫైర్ అయ్యారు. గత 10 ఏండ్ల బీఆరెస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరాచకాల గురించి K కోతి C చేష్టల R రాజ్యం (కేసీఆర్) పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే అది ఒక గ్రంథాలయానికి చాలొచ్చు.’ అంటూ విజయశాంతి తన ట్వీట్లో రాసుకొచ్చారు.