Sai Rajesh | ఒకటి రెండు సినిమాల్లో పరవాలేదు కష్టపడుతున్నాడు, కాస్త టాలెంట్ ఉన్న హీరోనే అనే టాక్ రాగానే లేనిపోని తగాదాల్లోకి దూరి, నోటి దురుసు చూపించి నలుగురు నోళ్ళల్లోనూ నానడం ఇప్పటివారికి పరిపాటి అయిపోయింది. వాళ్ల దగ్గరకు కథ చెప్పేందుకువచ్చినా సరిగా రిసీవ్ చేసుకోవకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటి తలపొగరు పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. అయితే హీరోలందరి ధోరణి ఇలా ఉండదు. కొందరిలో మాత్రమే ఇలాంటి లక్షణాలుంటాయి. వాటితో సాధించేది ఏం […]
Sai Rajesh |
ఒకటి రెండు సినిమాల్లో పరవాలేదు కష్టపడుతున్నాడు, కాస్త టాలెంట్ ఉన్న హీరోనే అనే టాక్ రాగానే లేనిపోని తగాదాల్లోకి దూరి, నోటి దురుసు చూపించి నలుగురు నోళ్ళల్లోనూ నానడం ఇప్పటివారికి పరిపాటి అయిపోయింది. వాళ్ల దగ్గరకు కథ చెప్పేందుకువచ్చినా సరిగా రిసీవ్ చేసుకోవకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటి తలపొగరు పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే హీరోలందరి ధోరణి ఇలా ఉండదు. కొందరిలో మాత్రమే ఇలాంటి లక్షణాలుంటాయి. వాటితో సాధించేది ఏం లేకపోయినా నలుగురు నోళ్ళల్లోనూ నానుతూ అయినదానికీ, కానిదానికీ తగాదాల్లో తలదూరుస్తూ ఉంటారు. అదిగో ఆ కోవకు చెందిన వాడే ఈహీరో.. విషయంలోకి వెళితే..
చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘బేబీ’ కథ అసలు అతని దగ్గరకే వెళ్ళిందట మొదట. అయితే ఆ హీరో సదరు వ్యక్తిని కలవడానికి కానీ, కథ వినడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించలేదట. అదిప్పుడు మరొకరి చేతికి వెళ్ళి మూవీ భారీ విజయాన్ని అందుకున్నాకా ఇప్పుడు ఆ మాట బయటికి వస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. విశ్వక్ సేన్. దర్శకుడు సాయి రాజేష్ ‘బేబీ’ కథ చెబుతానని తిరిగినా సరిగా స్పందించలేదనేది అసలు సంగతి.
దీనిమీద ఇద్దరి మధ్య ట్వీట్ల పర్వం కొనసాగినా అది వాళ్ళ వరకే ఉండిపోయింది. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఇటీవల ‘పేక మేడలు’ సినిమా ఈవెంట్లో ఈ వివాదానికి తన స్టైల్లో రిప్లయ్ ఇచ్చాడు. తనకు ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఆ దర్శకుడి కథ విని అతని సమయం వృధా చేయాలనుకోలేదని.. ఈ కారణంగానే అతనని కలవలేదనే క్లారిటీని ఇస్తూనే తన స్టైల్లో తనేం అందరికీ సంతృప్తిని ఇవ్వడానికి బిర్యానీని కాదన్నాడు.
అయితే ఇలా పుల్లలు పెట్టినట్టు మాట్లాడటం విశ్వక్ సేన్‌కు కొత్తేం కాకపోయినా, సదరు వివాదానికి సంబంధించి సాయి రాజేష్ కొన్ని వాఖ్యలు చేశాడు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్‌కి ‘బేబీ’ కథ చెబుదామని అనుకున్నప్పుడు అతను స్పందించలేదు. బహుశా అతను ప్రయారిటీ డైరెక్టర్స్ లిస్ట్‌లో నేను ఉండి ఉండకపోవచ్చు. అయితే సినిమాకు నో చెప్పే విధానం ఇది కాదని.. ఆ పద్దతి తనకు నచ్చలేదని సాయి రాజేష్ అన్నాడు.
అయితే మా సినిమా హిట్ అయింది. కానీ దీనిమీద విశ్వక్ సేన్ అన్నమాటలు నన్ను బాధించాయి. సక్సెస్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఇలా ఎదుటి వారిని అవమానించ వద్దన్న అతని మాటలు చాలా బాధ పెట్టాయి. మూవీ చేసే వీలు లేకపోతే అది డైరెక్ట్‌గా చెప్పాలి కానీ ఇలా ప్రవర్తించ వద్దు. కాస్త గౌరవంగానే నో చెబితే పోయేది.
గతంలో విశ్వక్ ఫస్ట్ ఫిల్మ్ ‘వెళ్ళిపోమాకే’ రిలీజ్ సమయంలో.. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలకు సినిమా చూపించి విడుదల అయ్యేలా చేశానని చెప్పుకొచ్చాడు సాయి రాజేష్. అలా అని అతని నుంచి కృతజ్ఞత కోరుకోవడం తప్పే కానీ.. ఆయన మాట్లాడిన విధానమే చాలా బాధించిందని సాయి రాజేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే రోజు రోజుకూ ముదురుతున్న ఈ వివాదంపై తిరిగి విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇద్దరిలో ఎవరో ఒకరైనా తగ్గితే కాస్త చక్కబడినట్టే.. లేదంటే ఇలా నేనే మోనార్క్‌ని అనే ధోరణి అన్ని వేళలా మంచిది కాదని ఇకనైనా ఈ ధోరణి మార్చుకుంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ యంగ్ హీరోకి ఈ విషయం తెలిస్తే బావుండునని అంతా అనుకుంటున్నారు.