Prigogine | చావు తప్పించుకున్నాడా?.. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణించలేదా?

Prigogine | విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణించలేదని, వెనిజులా తీరానికి ఆవల కరీబియన్ ద్వీపం ‘మార్గరీటా’లో దాక్కుని విలాసవంతమైన జీవితం ఎంజాయ్ చేస్తున్నాడంటూ? జరగబోయే విమాన ప్రమాదం గురించి అతడికి ముందే తెలుసంటూ పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే.. గత నెల 23న విమానం కూలిన దుర్ఘటనలో ప్రిగోజిన్ చావలేదని చెబుతున్నాడు రష్యన్ విశ్లేషకుడు వాలెరి సొలోవే. విమానం కూలి ప్రిగోజిన్ సహా అందరూ (మొత్తం 10 మంది) చనిపోయారని, […]

  • By: krs    latest    Sep 12, 2023 6:22 AM IST
Prigogine | చావు తప్పించుకున్నాడా?.. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణించలేదా?

Prigogine |

విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణించలేదని, వెనిజులా తీరానికి ఆవల కరీబియన్ ద్వీపం ‘మార్గరీటా’లో దాక్కుని విలాసవంతమైన జీవితం ఎంజాయ్ చేస్తున్నాడంటూ? జరగబోయే విమాన ప్రమాదం గురించి అతడికి ముందే తెలుసంటూ పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే..

గత నెల 23న విమానం కూలిన దుర్ఘటనలో ప్రిగోజిన్ చావలేదని చెబుతున్నాడు రష్యన్ విశ్లేషకుడు వాలెరి సొలోవే. విమానం కూలి ప్రిగోజిన్ సహా అందరూ (మొత్తం 10 మంది) చనిపోయారని, మృతుల్లో ప్రిగోజిన్ కూడా ఉన్నట్టుగా జన్యుపరీక్షలు నిర్ధారించాయని రష్యా నొక్కివక్కాణిస్తోంది.

ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాత్రం రష్యా వాదనను ఏమాత్రం విశ్వసించడం లేదు. ప్రిగోజిన్ మృతిని ఉక్రెయిన్ ఇంకా ధృవీకరించలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రిగోజిన్ మోసకారులని, అవసరాల కోసం తమను పోలిన వ్యక్తులను (డూప్స్) అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటారనే వాదన ఉంది.

తన పాచిక పారేలా, పన్నాగం ఫలించేలా, తాను సురక్షితంగా తప్పించుకునేలా రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పత్రుషెవ్ తో ప్రిగోజిన్ ఒప్పందం కుదుర్చుకున్నాడని, విమాన ప్రమాదంలో తాను
మరణించినట్టు బయటి ప్రపంచాన్ని భ్రమింపజేసి తప్పించుకున్నాడని ప్రొఫెసర్ వాలెరి సొలోవే అభిప్రాయం.