Warangal | 20వ వరకు డెడ్ లైన్.. MLA వినయ్ ఇంటిని ముట్టడిస్తాం: నాయిని
Warangal భద్రకాళి భూముల దురాక్రమణ కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ నెల 20వ తేదీ వరకు ఇవ్వకుంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ఇల్లును ముట్టడి చేస్తామని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే పంపిణీ చేయకుంటే మేమే ప్రజలను డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు తీసుకొని పోతామన్నారు. హనుమకొండలో సోమవారం నాయిని రాజేందర్ […]

Warangal
- భద్రకాళి భూముల దురాక్రమణ
- కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ నెల 20వ తేదీ వరకు ఇవ్వకుంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ఇల్లును ముట్టడి చేస్తామని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే పంపిణీ చేయకుంటే మేమే ప్రజలను డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు తీసుకొని పోతామన్నారు.
హనుమకొండలో సోమవారం నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 9సంవత్సరాల నుండి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెబుతారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరివైనా భూములు కబ్జా చేస్తే పోలిస్ కమిషనర్ ను కలువండి, తర్వాత మమ్మల్ని సంప్రదించండంటూ కోరారు.
ఎమ్మెల్యే సోదరుడు విజయ్ భాస్కర్ చేసిన తప్పులకు కేయు పోలిస్ స్టేషన్ సీఐ లు సస్పెండ్ అయ్యారని ఆరోపించారు. ఆయకు ఏ హోదాతో గన్ మెన్లు ఇచ్చారని, నక్సల్స్‌తో భయం ఉన్నందుకు గన్ మెన్లు ఇచ్చారంటే ఎన్ని అరాచకాలు చేశారోనని అనుమానం వ్యక్తం చేశారు.
భద్రకాళి భూముల ఆక్రమణ
భద్రకాళి బండ్ పద్మాక్షి గుట్ట FTL లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన భూకబ్జా దారులు మొరం పోసి నింపుతున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశము అనంతరం ఆయన భద్రకాళి బండ్లు అక్రమణ భూములను సందర్శించారు. పోచమ్మ కుంట భూమి కబ్జా చేస్తున్నారని విమర్శించారు. పోచమ్మ కుంట భూములను ఎవరు కొనవద్దున్నారు.
చెరువులు, కుంటలు కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. కొందరు ఎమ్మార్వోలు పై అధికారుల భార్యకు డబ్బులు ఇచ్చే సంస్కృతి వచ్చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, బంక సరళ, బిన్నీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.