Warangal | ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ వేధిస్తున్నాడు: జానకీపురం సర్పంచ్ నవ్య

Warangal నాభర్తను ట్రాప్ చేశారు రాజయ్య వాళ్ల మాటలు నమ్మి ఇబ్బంది పెడుతున్నడు కన్నీరుపెట్టుకున్న జానకీపురం సర్పంచ్ నవ్య పథకం ప్రకారం నన్ను బద్నాం చేస్తున్నారు: ఎమ్మెల్యే రాజయ్య విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. గతంలో తనను లైంగిక వేధింపులకు ఎమ్మెల్యే రాజయ్య గురి చేస్తున్నాడని ఆరోపించి సంచలనం సృష్టించిన నవ్య ఆ తర్వాత […]

  • Publish Date - June 21, 2023 / 12:35 PM IST

Warangal

  • నాభర్తను ట్రాప్ చేశారు
  • రాజయ్య వాళ్ల మాటలు నమ్మి ఇబ్బంది పెడుతున్నడు
  • కన్నీరుపెట్టుకున్న జానకీపురం సర్పంచ్ నవ్య
  • పథకం ప్రకారం నన్ను బద్నాం చేస్తున్నారు: ఎమ్మెల్యే రాజయ్య

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది.

గతంలో తనను లైంగిక వేధింపులకు ఎమ్మెల్యే రాజయ్య గురి చేస్తున్నాడని ఆరోపించి సంచలనం సృష్టించిన నవ్య ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఇరువురి మధ్య రాజీ కుదిరింది. అయిపోయిందనుకున్న సమస్యను సర్పంచ్ నవ్య తాజాగా మరోసారి తెరపైకి తెచ్చింది.

ఎన్నికల నేపథ్యంలో కొందరు కావాలని నన్ను బదనాం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దీనికి నవ్యను పావుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే రాజయ్య అంటున్నారు. తమ పార్టీకి చెందిన కొందరు తెర వెనక ఉండి నడుపుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచర వర్గం అంటోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎవరి వాదన సరైందో? ఎవరి ఆరోపణలు నిజమైనవో? అర్థం కావడం లేదని, స్థానికులు అయోమయానికి గురవుతున్నారు.

నా భర్తను కూడా ట్రాప్ చేశారు

గతంలో ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసిన నవ్య ఈసారి తన భర్త పై కూడా ఆరోపణలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి లోను చేసింది. తాజాగా సర్పంచ్ నవ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

కొద్ది రోజులక్రితం నవ్య ఎమ్మెల్యే రాజయ్య పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, ఆ వెంటనే కాంప్రమైజ్‌ చకచకా జరిగిపోయాయి. అప్పుడు నిశబ్దంగా మారినట్టే అనిపించిన లొల్లి మళ్లీ మొదలైంది. ఈ సారి తన కాపురంలో చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపణలు చేసే దాకా వెళ్లింది.

టేపులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి

గతంలో రాజయ్యపై తాను చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తున్నాడని నవ్య ఆరోపించింది. తనకు, తన భర్తకు మధ్య చిచ్చుపెట్టాలని రాజయ్య చూస్తున్నారని.. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.20 లక్షలు ఇస్తానని.. రాజీ చేసుకోవాలని కొందరితో ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది.

అలాగే గతంలో తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని బాండ్ రాసివ్వాలని బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నవ్య తెలిపారు. తన భర్తను ఓ మహిళా ప్రజాప్రతినిధితో ట్రాప్ చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

రాజయ్య పీఏ మాటలు నమ్మి తన భర్త ప్రతిరోజూ వేధిస్తున్నాడని నవ్య వాపోయారు. ఎమ్మెల్యేపై ఆరోపణల తర్వాత తనకు సరైన గౌరవం దక్కడం లేదని.. వెలివేసినట్లుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడి చేస్తానని నవ్య హెచ్చరించారు.