వరంగల్: ఇంజినీరింగ్ విద్యార్థి రక్షిత ఆత్మహత్య.. రాహుల్ అరెస్టు
అరెస్ట్ చేసిన భూపాలపల్లి పోలీసులు ఎంజీఎంలో రక్షిత మృతదేహానికి పోస్టుమార్టం విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తోటి విద్యార్థి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థిని పబ్బోజు రక్షిత(20)కేసులో అదే కళాశాల విద్యార్థి రాహుల్ ను అరెస్టు చేశారు. సోమవారం రాహుల్ ను భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ నగరం రామన్నపేటలో తమ బాబాయి ఇంటిలో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రక్షిత మిస్సింగ్ అయినట్లు […]

- అరెస్ట్ చేసిన భూపాలపల్లి పోలీసులు
- ఎంజీఎంలో రక్షిత మృతదేహానికి పోస్టుమార్టం
విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తోటి విద్యార్థి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థిని పబ్బోజు రక్షిత(20)కేసులో అదే కళాశాల విద్యార్థి రాహుల్ ను అరెస్టు చేశారు. సోమవారం రాహుల్ ను భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ నగరం రామన్నపేటలో తమ బాబాయి ఇంటిలో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా రక్షిత మిస్సింగ్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపాల్ పల్లి పోలీసులు రెండు రోజుల క్రితమే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం రక్షిత వరంగల్ నగరంలోని తమ బాబాయ్ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రక్షిత వేధింపుల కేసులో రాహుల్ ను భూపాల్ పల్లి పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
వేధింపుల వల్లే రక్షిత ఆత్మహత్య
భూపాల్ పల్లి కి చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నది. అదే కాలేజీలో చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి రక్షితను వేధించారని ఆరోపణలు ఉన్నాయి. తనను ర్యాగింగ్ చేశారని కళాశాల యాజమాన్యానికి రక్షిత కంప్లైంట్ చేసినప్పటికీ కాలేజీ యజమాన్యం పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఈలోపు రక్షిత కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రక్షిత రామన్నపేట బంధువుల ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు మృతదేహం తరలించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.