Warangal | విద్యుత్ కార్మికుడి సాహసం.. ఏడు గ్రామాలకు విద్యుత్ సరఫరా

Warangal శ్రీకాంత్‌కు అధికారుల ప్రశంసలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ సర్కిల్, కొత్తగూడ సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో పోల్ లు, ట్రాన్స్ఫార్మర్లు మునిపోయినాయి. ఈ నేపథ్యంలో పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా గురువారం బ్రేక్ డౌన్ అయ్యింది. విష‌యం తెలుసుకున్న మహబూబాబాద్ సర్కిల్, సూపెరింటెండింగ్ ఇంజనీర్ నరేష్, మహబూబాబాద్ డివిజినల్ ఇంజనీర్ విజయ్, […]

Warangal | విద్యుత్ కార్మికుడి సాహసం.. ఏడు గ్రామాలకు విద్యుత్ సరఫరా

Warangal

  • శ్రీకాంత్‌కు అధికారుల ప్రశంసలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ సర్కిల్, కొత్తగూడ సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో పోల్ లు, ట్రాన్స్ఫార్మర్లు మునిపోయినాయి. ఈ నేపథ్యంలో పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా గురువారం బ్రేక్ డౌన్ అయ్యింది.

విష‌యం తెలుసుకున్న మహబూబాబాద్ సర్కిల్, సూపెరింటెండింగ్ ఇంజనీర్ నరేష్, మహబూబాబాద్ డివిజినల్ ఇంజనీర్ విజయ్, ఏడీఈ కవిత పర్యవేక్షణలో కొత్తగూడ సెక్షన్ ఏఈ సురేష్ వారి సిబ్బంది క్రింద విధులు నిర్వర్తిసున్న శ్రీకాంత్ అనే ఆన్ మ్యానేడ్ కార్మికుడుకి శుక్రవారం స‌మ‌స్య‌ను వివ‌రించారు. చెప్పిన వెంటనే పొగుళ్లపల్లి గ్రామం సమీపంలోని పాకాల వాగులో గుండె నిబ్బరం, ఆత్మ స్టెర్యంతో ప్రవేశించి, ధైర్యంగా ఈత కొడుతూ 11Kv స్తంభానికి చేరుకున్నాడు.

ఆ త‌రువాత అత్యంత కష్టం మీద స్తంభాన్ని ఎక్కి జంపర్‌లను తెరవడం ద్వారా 4 మునిగి ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు పవర్ లేకుండా చేయడం ద్వారా పోగుళ్లపల్లి, గోవిందపూర్, బోరింగ్ తాండా, మొండ్రాయిగూడెం, మోకాళ్లపల్లి,చక్రాల తాండ గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించగలిగారు. శ్రీకాంత్ కష్టాన్ని అందరు గుర్తించి ప్రశంసలు అందించారు.

ఈ ఆరు గ్రామాల్లో దాదాపు 954 మంది నివసిస్తూ ఉంటున్నారు. శ్రీకాంత్ ధైర్య సాహసాలకు ఉన్నధికారులు అభినంద‌న‌లు తెలిపారు. గ్రామా ప్రజల చేత ప్రశంసలు అందుకున్నారు. శ్రీకాంత్ 6 గ్రామాల ప్రజలకు విద్యుత్ అందించగలిగావ‌ని మహబూబాబాద్ ఏడీఈ కవిత, డివిజినల్ ఇంజనీర్ విజయ్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ నరేష్ మెచ్చుకున్నారు.