Kerala High Court | ఫోన్‌లో.. ఒంటరిగా పోర్న్‌చూడటం నేరం కాదు
Kerala High Court అతడి గోప్యతకు భంగం కలిగించడమే కేరళ హైకోర్టు సింగింల్ బెంచ్ స్పష్టీకరణ విధాత: మొబైల్ ఫోన్‌లో ఒంటరిగా అశ్లీల చిత్రాలు, వీడియోలు (ఫోర్న్) చూడటం నేరం కాదని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, ఫోర్న్ ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయడం, ప్రదర్శించడం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం నేరమని వెల్లడించింది. కేరళలోని అంగమలి కారుకుట్టికి చెందిన ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలను వీక్షించాడనే ఆరోపణలపై అలువా పోలీసులు […]

Kerala High Court
- అతడి గోప్యతకు భంగం కలిగించడమే
- కేరళ హైకోర్టు సింగింల్ బెంచ్ స్పష్టీకరణ
విధాత: మొబైల్ ఫోన్‌లో ఒంటరిగా అశ్లీల చిత్రాలు, వీడియోలు (ఫోర్న్) చూడటం నేరం కాదని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, ఫోర్న్ ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయడం, ప్రదర్శించడం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం నేరమని వెల్లడించింది. కేరళలోని అంగమలి కారుకుట్టికి చెందిన ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలను వీక్షించాడనే ఆరోపణలపై అలువా పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం తీర్పు వెల్లడించింది.
అసలు కేసు ఏమిటంటే.. 2016 జూలై 11వ తేదీ రాత్రి కేరళలోని ఎర్నాకులం జిల్లా అలువా మున్సిపాలిటీలోని అలువా ప్యాలెస్ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన వీడియో చూశారనే అభియోగంపై అతనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును సవాల్‌చేస్తూ బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ కేసును బుధవారం సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కున్హికృష్ణన్ విచారించారు. పిటిషనర్ నేరం అంగీకరించినప్పటికీ, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 కింద నమోదైన కేసు నిలబడదని తెలిపారు. ఈ కేసులో తదుపరి చర్యలను కూడా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అసభ్యకరమైన విషయాలను వ్యక్తిగతంగా చూసే విషయంలో జోక్యం చేసుకోవడం అతని గోప్యతకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు.
శతాబ్దాలుగా అశ్లీల సాహిత్యం
అశ్లీల సాహిత్యం శతాబ్దాలుగా ఉన్నదని న్యాయమూర్తి జస్టిస్ కున్హికృష్ణన్ తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్ ఉన్న అందరికీ మునివేళ్ల దగ్గర అశ్లీల సాహిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యవేక్షణ లేకుండా మైనర్ పిల్లలకు మొబైల్ ఫోన్లు అందజేయడం వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆయన తల్లిదండ్రులను హెచ్చరించారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్లలో పోర్న్ వీడియోలను సులభంగా యాక్సెస్ చేయవచ్చని, పిల్లలు వాటిని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు.