ఉమ్మడి నల్గొండను గుండెల్లో పెట్టుకుంటాం: మంత్రి కేటీఆర్
ఎన్నికల హామీలన్నీఅమలు చేస్తాం మునుగోడులో ముగిసిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశం విధాత: మునుగోడు ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ అన్నట్టుగానే మునుగోడుతో పాటు టీఆర్ఎస్ ను గెలిపించిన ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలను గుండెల్లో పెట్టుకుంటామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో గురువారం నిర్వహించిన అభివృద్ధి సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తామన్నారు. […]

- ఎన్నికల హామీలన్నీఅమలు చేస్తాం
- మునుగోడులో ముగిసిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశం
విధాత: మునుగోడు ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ అన్నట్టుగానే మునుగోడుతో పాటు టీఆర్ఎస్ ను గెలిపించిన ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలను గుండెల్లో పెట్టుకుంటామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో గురువారం నిర్వహించిన అభివృద్ధి సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాబోయే ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తామన్నారు. దామరచర్లలో కడుతున్న అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ లో భవిష్యత్ తరాలకు అనుగుణంగా 4వేల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగబోతోందన్నారు. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేలా నల్గొండ జిల్లా మారబోతోందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. మునుగోడు ఫలితాలు వచ్చిన నెలలోపే ఐదుగురు మంత్రులచే అభివృద్ధిపై ఇక్కడ సమీక్ష నిర్వహించామన్నారు.
ఆరు, ఏడు నెలల్లోనే ఆర్అండ్ బీ, మున్సిపల్, గిరిజన, పీఆర్ శాఖలకు రూ.1544 కోట్ల నిధులు 12 నియోజకవర్గాల్లో ఖర్చు చేయబోతున్నామన్నారు. రూ.402 కోట్లతో ఉమ్మడి జిల్లాలో రోడ్లు, రూ.700 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ, రూ.334 కోట్లు మున్సిపల్ కు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.100 కోట్లు కేటాయించి పనులు చేపట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.
మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లులు..
మునుగోడుకు రూ.100 కోట్లతో రోడ్ల మరమ్మతులు, రూ.175 కోట్లతో పీఆర్, చండూరు రూ.30, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున, రూ.80 కోట్లు మున్సిపల్ శాఖ, గిరిజన తండాల అభివృద్ధికి 25 కోట్లు, 8 కోట్లతో 5 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియతో పాటు 100 పడకల ఆసుపత్రికి ఎక్కడ స్థలం అనుకూలంగా ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.
దండు మల్కాపురంలో 100 ఎకరాల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా ఆట వస్తువుల తయారీ కేంద్రం టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. నారాయణపూర్ లో బంజారా భవన్, గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. నేతన్నలకు మాట ఇచ్చినట్టుగానే హ్యాండ్లూ మ్ క్లస్టర్స్ కి కట్టుబడి ఉన్నామన్నారు.